కాగజ్‌నగర్‌టౌన్:పట్టణంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యాసంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. విద్యాలయంలో ఖాళీగా ఉన్న 80 సీట్లను భర్తీ చేసేందుకు డిసెంబర్ 13న ప్రవేశ పరీక్ష నిర్వహించగా మంగళవారం ఫలితాలు వెల్లడించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి 6,196 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా 4,478 మంది హాజరయ్యారు. రిజర్వేషన్, మార్కుల ఆధారంగా ఆదిలాబాద్ నుంచి 17 మంది, నిర్మల్ నుంచి 37 మంది, మంచిర్యాల నుంచి 19 మంది, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి ఏడుగురు మొత్తంగా 80 మంది ఎంపికై నట్లు ఆయన పేర్కొన్నారు.


