మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్‌ | - | Sakshi
Sakshi News home page

మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్‌

Mar 17 2026 7:52 AM | Updated on Mar 17 2026 7:52 AM

ఆదిలాబాద్‌రూరల్‌: ఇఫ్తార్‌ మత సామరస్యానికి ప్ర తీక అని కలెక్టర్‌ రాజర్షిషా అన్నారు. మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం స్థానిక టీఎన్జీవో గార్డెన్‌లో ఏర్పాటు చేసిన ‘దావత్‌–ఏ–ఇఫ్తార్‌ కార్యక్రమానికి ఎస్పీ అఖిల్‌ మహాజన్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పవిత్ర రంజాన్‌ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పేద ముస్లింలకు గిఫ్ట్‌ ప్యాక్‌లు అందిస్తున్నామని తెలిపారు. ఇందులో భా గంగా ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో 1500 ప్యాక్‌లు, బోథ్‌ నియోజకవర్గంలో 750 ప్యాక్‌లు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. అనంతరం పలువురికి గిఫ్ట్‌ ప్యాక్‌లు అందజేశారు. కార్యక్రమంలో మున్సి పల్‌ వైస్‌చైర్మన్‌ రోహిత్‌, మైనారిటీ సంక్షేమ అధి కా రి కలీమ్‌, ప్రజాప్రతినిధులు, ముస్లిం మతపెద్దలు, జిల్లా అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement