జాతీయ స్థాయికి ఎదగడం అభినందనీయం | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయికి ఎదగడం అభినందనీయం

Mar 18 2026 8:10 AM | Updated on Mar 18 2026 8:10 AM

బజార్‌హత్నూర్‌: గిరిజన క్రీడాకారులు జాతీయస్థాయికి ఎదగడం అభినందనీయమని ఏజెన్సీ డీఈవో గోడం చందన్‌ అన్నారు. ఇటీవల హన్మకొండలో నిర్వహించిన 60 మీటర్ల పరుగుపందెం రాష్ట్రస్థాయి పోటీల్లో జాతర్ల ఆదర్శ క్రీడా పాఠశాల విద్యార్థి కోట్నాక్‌ జాకేష్‌ ఉత్తమ ప్రతిభ కనబర్చి గోల్డ్‌మెడల్‌ సాధించాడు. ఈ నెల 28న హర్యానలో జరుగనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. మంగళవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏజెన్సీ డీఈవో గోడం చందన్‌ సదరు విద్యార్థిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేశ్‌, జిల్లా గిరిజన క్రీడాల అధికారి పార్థసారథి, ఏసీఎంవో అర్క జగన్‌, ఏటీడీవో సుచంత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement