లోకేశ్వరం: మండలంలోని వట్టోలిలో ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు. గ్రామానికి చెందిన శివరాత్రి భోజన్న(35) ఏపనీ చేయకుండా ఖాళీగా తిరుగుతుండేవాడు. ఈక్రమంలో మద్యానికి బానిసయ్యాడు. ఈ విషయమై శనివారం అతని భార్య రుచిత మందలించి పిల్లలతో కలిసి తీర్థయాత్రకు వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన భోజన్న సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మంగళవారం భోజన్న సోదరుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


