సమన్వయంతో పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతో పనిచేయాలి

Mar 17 2026 7:52 AM | Updated on Mar 17 2026 7:52 AM

● జిల్లాను గంజాయి రహితంగా మార్చాలి ● అధికారులతో సమీక్షలో కలెక్టర్‌ రాజర్షిషా

కైలాస్‌నగర్‌: జిల్లాను గంజాయి రహితంగా మా ర్చేందుకు సంబంధిత శాఖల అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ రాజర్షి షా ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో గంజా యి సాగు, మాదకద్రవ్యాల నిర్మూలనపై ఎస్పీ అఖి ల్‌ మహాజన్‌తో కలిసి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, మా దక ద్రవ్యాల వ్యాప్తిని అరికట్టేందుకు పోలీస్‌శాఖతో పాటు విద్య, రెవెన్యూ, ఆరోగ్యశాఖలు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరముందన్నారు. యాంటీ డ్రగ్‌ కమిటీల ద్వారా గ్రామాలు, పట్టణాలు, పాఠశాలలు, కళాశాలల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించిన రైతులపై చట్టపరమైన చర్యలతో పాటు ప్రభుత్వ పథకాలు అందకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ మాట్లాడుతూ, జిల్లాలో గంజాయి, మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు పోలీస్‌శాఖ కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తుందన్నారు. సమావేశంలో ఐటీడీఏ పీవో యువరాజ్‌ మర్మాట్‌, అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌, ఆర్డీవో స్రవంతి, ఆర్టీవో శ్రీనివాస్‌, డీపీవో రమే శ్‌, డీఎంహెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌, డీఏవో శ్రీధర్‌, ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ హిమశ్రీ, ఆర్‌అండ్‌బీ ఈఈ నర్సయ్య పాల్గొన్నారు.

ప్రమాదాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు

రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో రోడ్డు భద్రతపై ఎస్పీ అఖి ల్‌ మహాజన్‌తో కలిసి సోమవారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ, రహదారి ప్రమాదాల నివారణకురవాణా, పోలీస్‌శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారుల పై కఠిన చర్యలు తీసుకోవా లని ఆదేశించారు. ఎస్పీమాట్లాడుతూ, పోలీస్‌ శాఖ ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు విస్తృ త అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ముందుగా మండలాల వారీగా రహదారి ప్రమాదా లు జరిగే హాట్‌ స్పాట్‌లను, నివారణ చర్యలపై పవర్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అధికారులు వివరించారు. ఇందులో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

వైద్యశిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి

సాత్నాల: వైద్యశిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ రాజర్షిషా అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మండలంలోని సైద్‌పూర్‌ పీహెచ్‌సీలో ఏర్పాటు చేసిన వైద్య శిబి రంతో పాటు మేడిగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో రిమ్స్‌సహకారంతో ఏర్పాటు చేసిన ఉచి త వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. వైద్యులు రోగులను పరీక్షించి మందులు పంపిణీ చేశారు. అనంతరం మేడిగూడలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారు నూత న గృహ ప్రవేశానికి కలెక్టర్‌ హాజరయ్యారు. కార్యక్రమంలో రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌, డీఎంహెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌, తహసీల్దార్‌ రామారావు, ఇన్‌చార్జి ఎంపీడీవో వెంకట్‌రాజు,చాంబర్‌ ఆఫ్‌కామర్స్‌ అండ్‌ ట్రేడ్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు శివ ప్రసా ద్‌, సర్పంచ్‌ లక్ష్మి, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement