మచ్చలుంటే వైద్యులను సంప్రదించాలి | - | Sakshi
Sakshi News home page

మచ్చలుంటే వైద్యులను సంప్రదించాలి

Mar 19 2026 7:47 AM | Updated on Mar 19 2026 7:47 AM

ఆదిలాబాద్‌టౌన్‌: శరీరంపై మచ్చలు ఉంటే వైద్యులను సంప్రదించాలని డీఎంహెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని చిల్కూరిలక్ష్మినగర్‌ పట్టణ ఆరోగ్యకేంద్రంలో బుధవారం కుష్ఠు గుర్తింపు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఈనెల 18 నుంచి 31వరకు కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ఆశ కార్యకర్తలతో ఇంటింటి సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. శరీరంపై పాలిపోయిన, రాగి రంగు గల మొద్దుబారిన మచ్చలు, కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు ఉంటే కుష్ఠుగా అనుమానించి ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎండీటీతో వ్యాధి పూర్తిగా నయం అవుతుందన్నారు. కుష్ఠు రహిత సమాజం కోసం ప్రతి ఒక్క రూ కృషి చేయాలన్నారు. ఇందులో కుష్ఠు నివారణ అధికారి ఈశ్వర్‌రాజ్‌, వైద్యాధికారి దీపిక, డిప్యూటీ పారామెడికల్‌ అధికారులు వామన్‌రావు, రమేశ్‌, విష్ణు, నిజాముద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు వేగవంతంగా వైద్య సేవలు

ప్రజలకు వేగవంతంగా వైద్యసేవలు అందించినందుకు కృషి చేస్తున్నట్లు డీఎంహెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌ తెలిపారు. డీఎంహెచ్‌ఓ సమావేశ మందిరంలో అంబులెన్స్‌ సేవలపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని కొన్ని మండలాల్లో అంబులెన్స్‌ వాహన సేవలను విస్తరించినందుకు కృషి చేస్తున్నామన్నారు. సిబ్బంది పనితీరును అభినందించారు. సమావేశంలో 108 జిల్లా మేనేజర్‌ శేఖర్‌, 102 జిల్లా మేనేజర్‌ మనోహర్‌, పీఎం సామ్రాట్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement