‘హామీల అమలులో కాంగ్రెస్‌ సర్కారు విఫలం’ | - | Sakshi
Sakshi News home page

‘హామీల అమలులో కాంగ్రెస్‌ సర్కారు విఫలం’

Mar 17 2026 7:52 AM | Updated on Mar 17 2026 7:52 AM

నేరడిగొండ: ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత ఎక్కడ..? కాంగ్రెస్‌ సర్కారుకు ప్రజల పట్ల నిబద్ధత లేదని బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ అన్నారు. సోమవారం నుంచి ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు హాజరయ్యారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌ వద్ద ఉన్న అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్‌ సర్కారు ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుపై నిరసన వ్యక్తం చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమవుతోందని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement