ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సంఘం (పీఎస్‌హెచ్‌ఎంఏ) ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్, డైరీలను డీఈవో రాజేశ్వర్ మంగళవారం ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని ఆయన కార్యాలయంలో ఆవిష్కరించి మాట్లాడారు. ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి, విద్యార్థుల బంగా రు భవితకు బాటలు వేయాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు కొమ్ము జ్యోతి, జిల్లా అధ్యక్షుడు సు భాష్‌పాటిల్, గౌరవాధ్యక్షుడు రంజిత్, ప్రధా న కార్యదర్శి జాదవ్ గోవింద్, మల్లేశ్, మునేశ్వర్, మదన్‌మోహన్, సాహెబ్ రావు పవార్, దినేష్‌రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.


