కుంటాల: కుంటాలలోని సృజన విద్యాలయం నుంచి 37 మంది విద్యార్థులు ప్రతిభ కనబర్చి నవోదయలో చదివేందుకు ఎంపికయ్యారు. ఇందులో కాగజ్‌నగర్‌లోని జవహర్ నవోదయ పాఠశాలకు 23 మంది, నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్ జవహర్ నవోదయ పాఠశాలకు 13 మంది, వరంగల్, జగిత్యాల జిల్లాల జవహర్ నవోదయ పాఠశాలలకు ఒక్కొక్కరు చొప్పున ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ కొత్తకాపు గంగన్న తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా టాపర్‌గా ఒడ్నం సహర్ష్, నిజామాబాద్ జిల్లా టాపర్‌గా రాజారాం లేక్షన నిలిచారు. కల్లూరులోని ఎస్‌ఎంఎస్ పాఠశాల నుంచి 17 మంది, కుంటాలలోని శాంతినికేతన్ పాఠశాల నుంచి 11 మంది విద్యార్థులు ఎంపికై నట్లు ప్రిన్సిపాళ్లు గజానన్, సంతోష్ తెలిపారు. ఎంపికై న విద్యార్థులను పలువురు అభినందించారు.
రాజారాం లేక్షన,
నిజామాబాద్ జిల్లా టాపర్
ఒడ్నం సహర్ష్, ఆదిలాబాద్ జిల్లా టాపర్


