ముగిసిన గోవింద్‌నాయక్‌ అంత్యక్రియలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన గోవింద్‌నాయక్‌ అంత్యక్రియలు

Mar 18 2026 8:10 AM | Updated on Mar 18 2026 8:10 AM

దండేపల్లి/ఆదిలాబాద్‌టౌన్‌: ఖానాపూర్‌ మాజీ ఎమ్మెల్యే గోవింద్‌నాయక్‌ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్‌లోని స్వగృహంలో అనా రోగ్యంతో సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన భౌతిక కాయాన్ని మంగళవారం మాజీ మంత్రులు జీవన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్‌, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, రేఖానాయక్‌, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్‌, డీసీసీ మాజీ అధ్యక్షుడు రవీందర్‌రావు, ఖానాపూర్‌ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి జాన్సన్‌ నాయక్‌, వివిధ పార్టీల నాయకులు సందర్శించి నివాళులర్పించారు. ప్రజల సందర్శనాంతరం సాయంత్రం గ్రామ సమీపంలో ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఆయన పెద్దకుమారుడు అరవింద్‌ తండ్రి చితికి నిప్పు పెట్టి అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement