మంచిర్యాలఅర్బన్: పట్టణంలోని శ్రీహర్ష డిగ్రీ కళాశాల విద్యార్థిని ఇండోనేషియాలో నిర్వహించిన బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రతిభ కనబర్చి గోల్డ్‌మెడల్ సాధించింది. కళాశాలలో డిగ్రీ బీజెడ్‌సీ తృతీయ సంవత్సరం చదువుతున్న దేవల్ల శ్రావణి ఫిబ్రవరి 14 నుంచి 19 వరకు బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఏషియా ఆధ్వర్యంలో ఇండోనేషియాలో నిర్వహించిన పోటీల్లో ఇండియా తరుపున పాల్గొని ప్రతిభ కనబర్చి దేశానికి వన్నె తెచ్చింది. సదరు విద్యార్థినిని మంగళవారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాశాల చైర్మన్ పల్లె భూమేష్ సన్మానించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు మనోహర్‌రెడ్డి, తనుగుల శ్రావణ్, కళాశాల ప్రిన్సిపాల్ అనిత, తదితరులు పాల్గొన్నారు.


