కైలాస్‌నగర్: గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులైన కూలీ లందరికీ వందరోజుల పాటు తప్పనిసరిగా పని క ల్పించాలని డీఆర్డీవో రాథోడ్ రవీందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో ఉపాధి హామీ ఏపీవో లు, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లతో మంగళవారం జిల్లాస్థాయి సమీక్ష నిర్వహించారు. మండలాల వా రీగా ఉపాధి హామీ పనులు, హాజరవుతున్న కూలీల ప్రగతిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పనులకు హాజరయ్యే కూలీల సంఖ్యను పెంచాల్సిన అవసరముందన్నారు. దరఖా స్తు చేసుకున్న ప్రతి కూలీకి పని కల్పించేలా శ్రద్ధ వ హించాలన్నారు. 2026–27 వార్షిక సంవత్సరానికి సంబంధించి పనుల ప్రణాళికను యుక్తధార పోర్టల్‌లో పక్కాగా నమోదు చేయాలన్నారు. రానున్న వర్షాకాలానికి సంబంధించి పూర్తిస్థాయిలో మొక్కలు అందించేలా నర్సరీలను సిద్ధం చేయాలన్నారు. ఎండల తీవ్రతకు మొక్కలు వాడిపోకుండా ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఉపాధి కూలీల సంఖ్య పెంపుతోపాటు పనులు వేగంగా జరిగేలా శ్రద్ధ వహించాలన్నారు. సమావేశంలో అదనపు డీఆర్డీవో కుటుంబరావు, ఏపీడి గజానన్‌రావు, కృష్ణారావు, ఏవో గంగాధర్ తదితరులు పాల్గొన్నారు


