తానూరు: జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలవగా మండలకేంద్రంలోని వాసవి పాఠశాల విద్యార్థి అవదుత్‌వార్ గణేశ్ ప్రతిభ కనబర్చి కాగజ్‌నగర్‌లోని జవహర్ నవోదయ విద్యాలయానికి ఎంపికై నట్లు పాఠశాల డైరెక్టర్ నర్సయ్య, ప్రిన్సిపాల్ లక్ష్మణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు.
కుభీర్: మండలకేంద్రంలోని ప్రగతి విద్యానికేతన్ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు శ్రీబిందు, సొప్పరి పూజ నవోదయ విద్యాలయంలో చదివేందుకు ఎంపికయ్యారు. వీరిని పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఆనంద్, కరస్పాండెంట్ గంగాధర్, ఉపాధ్యాయులు గంగాకిశోర్ తదితరులు ఉన్నారు.


