ఆ హీరోతో పెళ్లి వార్తలు.. బొమ్మరిల్లు హీరోయిన్‌ రియాక్షన్! | Actress Genelia Reacts On Marriage With Hero in Shooting Set | Sakshi
Sakshi News home page

Genelia: సెట్‌లోనే ఆ హీరోతో పెళ్లి.. జెనీలియా రియాక్షన్!

Jun 16 2025 9:29 PM | Updated on Jun 16 2025 9:29 PM

Actress Genelia Reacts On Marriage With Hero in Shooting Set

బొమ్మరిల్లు హీరోయిన్ జెనీలియా తెలుగువారికి సుపరిచితమైన పేరు. టాలీవుడ్‌ సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ ఆ తర్వాత నటుడు రితేశ్ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడింది. పెళ్లి తర్వాత దాదాపు సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం అమిర్ ఖాన్ చిత్రం సితారే జమీన్ పర్‌లో కనిపించనుంది. ఆమిర్‌ ఖాన్‌ హీరోగా నటించిన ఈ చిత్రం జూన్‌ 20న విడుదల కానుంది.

అయితే గతంలో హీరో జాన్ అబ్రహంతో జెనీలియా పెళ్లి జరిగిందన్న వార్తలొచ్చాయి. దాదాపు 14 ఏళ్ల క్రితం జరిగిన ఈ ప్రచారంపై తాజాగా జెనీలియా స్పందించారు. ఆ వార్తలు ఎవరో సృష్టించారో తనకు తెలుసన్నారు. దానికి వాళ్లే సమాధానం చెప్పాలన్నారు.

తాజా ఇంటర్వ్యూలో జెనీలియా మాట్లాడుతూ..'బాలీవుడ్‌ నటుడు జాన్‌ అబ్రహం.. నేు ఓ ప్రాజెక్ట్‌ కోసం కలిసి వర్క్‌ చేశాం. ఆ సినిమా సెట్‌లో అనుకోకుండా మా పెళ్లి జరిగిందంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే అదంతా కేవలం రూమర్స్ మాత్రమే. అందులో ఎలాంటి వాస్తవం లేదు. మాకు పెళ్లి జరగలేదు. కొంతమంది పీఆర్‌లు ఇలాంటి చెత్త న్యూస్‌ క్రియేట్ చేశారు. ఇలాంటి వార్తలు ఎందుకు ప్రచారం చేశారో వారినే అడగండి' అని అన్నారు. కాగా.. జెనీలియా - జాన్‌ అబ్రహం జంటగా ఫోర్స్‌ అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా 2011లో విడుదల కాగా.. ఓ సీన్‌లో భాగంగా వీరిద్దరికీ నిజంగానే పెళ్లి చేశారంటూ తెగ వైరలైంది. ఆ కథనాలకు చెక్‌ పెడుతూ ఆ తర్వాత ఏడాదిలోనే రితేశ్ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement