నేటి నుంచి ఆ్రస్టేలియన్ ఓపెన్ టోర్నీ
తొలి ట్రోఫీ వేటలో అల్‌కరాజ్
25వ టైటిల్ కోసం జొకోవిచ్ ప్రయత్నం
సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ‘ఆస్ట్రేలియన్ ఓపెన్’కు రంగం సిద్ధమైంది. నేటి నుంచి జరిగే ఈ టెన్నిస్ టోర్నీ కోసం సూపర్ స్టార్లు అల్‌కరాజ్, సినెర్‌లతో పాటు 25వ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేసిన టెన్నిస్ దిగ్గజం జొకోవిచ్ బరిలోకి దిగుతున్నాడు. మహిళల సింగిల్స్‌లో రెండుసార్లు తుది మెట్టుపై టైటిల్ చేజార్చుకున్న స్వియాటెక్ ఫేవరెట్‌గా సమరానికి సై అంటోంది.
మెల్‌బోర్న్: స్పానిష్ సంచలనం కార్లొస్ అల్‌కరాజ్ ఆస్ట్రేలియా గడ్డపై బోణీ కోసం సిద్ధమవుతుంటే సెర్బియన్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ తనకు అచ్చొచి్చన ఓపెన్‌లోనే 25వ గ్రాండ్‌స్లామ్ సాకారం చేసుకోవాలని చూస్తున్నాడు. వీళ్లిద్దరిని దాటేసి వరుసగా మూడో ఏడాది కూడా టైటిల్ గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ఇటలీ స్టార్, వరల్డ్ నంబర్‌వన్ యానిక్ సినెర్ పట్టుదలతో ఉన్నాడు.
ఈ నేపథ్యంలో నేడు మొదలయ్యే ఆ్రస్టేలియన్ ఓపెన్ టెన్నిస్ టోరీ్నలో ఎలాంటి ఫలితాలు వస్తాయనేది ఆసక్తికరం. ‘హ్యాట్రిక్’ వేటలో సినెర్... తొలి రౌండ్లో గ్యాస్టన్ (ఫ్రాన్స్)ను ఎదుర్కొంటాడు. 22 ఏళ్ల స్పెయిన్ స్టార్ అల్‌కరాజ్ ఇక్కడ తప్ప మిగతా మూడు గ్రాండ్‌స్లామ్‌లు ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్‌లను రెండేసి సార్లు చేజిక్కించుకున్నాడు. ఆరు గ్రాండ్‌స్లామ్‌లను సాధించినప్పటికీ ఈ స్పెయిన్ టాప్‌సీడ్‌కు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఇంకా వెలితిగానే ఉంది. గత రెండేళ్లుగా (2024, 2025) క్వార్టర్ ఫైనల్ అంచెను దాటని అతను ఈసారైనా ట్రోఫీని అందుకోవాలని ఆశిస్తున్నాడు.
కెరీర్ చరమాంకంలో ఉన్న జొకోవిచ్ చిరస్మరణీయమైన 25వ టైటిల్ కోసం రాకెట్‌కు పదును పెడుతున్నాడు. ఇక్కడ పది టైటిల్స్ సాధించిన జొకో 11వ టైటిల్ సాధిస్తే తన కెరీర్‌కు గ్రాండ్‌గా వీడ్కోలు పలికే అవకాశముంది. మూడేళ్ల క్రితం 2023లో చివరిసారిగా ఆ్రస్టేలియా ఓపెన్‌లో విజేతగా నిలిచాడు. అదే ఏడాది ఫ్రెంచ్, యూఎస్ ఓపెన్‌లను గెలిచిన ఈ సెర్బియన్ ఆల్‌టైమ్ గ్రేట్... రెండేళ్లుగా ‘25వ గ్రాండ్‌స్లామ్’ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నాడు. ఈ హేమాహేమీలతో పాటు రెండు సార్లు (2020, 2024) రన్నరప్‌తోనే సరిపెట్టుకున్న జర్మనీ ప్లేయర్, మూడో సీడ్ జ్వెరెవ్, ఐదో సీడ్ లోరెంజొ మ్యూసెటి (ఇటలీ), రష్యన్ స్టార్లు రుబ్లెవ్, మెద్వెదెవ్, 2014 చాంపియన్, స్విట్జర్లాండ్ వెటరన్ స్టార్ వావ్రింకా సైతం ఆసీస్ బరిలోకి దిగుతున్నారు. వావ్రింకాకు వీనస్ విలియమ్స్‌కు ఇచి్చనట్లే నిర్వాహకులు వైల్డ్‌కార్ట్ ఎంట్రీ ఇచ్చారు.
స్వియాటెక్ ఈసారైనా!
పోలండ్ స్టార్ ఇగా స్వియాటెక్‌ను ఆ్రస్టేలియన్ ఓపెన్ ఆఖరి దాకా ఊరించి చివరకు నిరాశపరుస్తోంది. 2022తో పాటు గతేడాది కూడా రన్నరప్‌తోనే సరిపెట్టుకున్న స్వియాటెక్ ఈ సారి ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో ఉంది. అమెరికన్ టెన్నిస్ స్టార్ మాడిసన్ కీస్ డిఫెండింగ్ చాంపియన్ హోదాతో టైటల్ వేటకు సిద్ధమవగా, జెస్సికా పెగూలా (అమెరికా), ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్), 2021 రన్నరప్ కరొలినా మ్యుచొవా (చెక్ రిపబ్లిక్), 2024 రన్నరప్ కోకో గాఫ్ (అమెరికా), రెండుసార్లు ఆ్రస్టేలియన్ ఓపెన్ (2023, 2024) సాధించిన బెలారస్ స్టార్, టాప్ సీడ్ సబలెంక టోర్నీ ఫేవరేట్లుగా ఉన్నారు.


