ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల విజేతగా రిబకినా | Rybakina Stuns Sabalenka, Clinches 1st Aus Open Title | Sakshi
Sakshi News home page

Australian Open 2026: ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల విజేతగా రిబకినా

Jan 31 2026 7:05 PM | Updated on Jan 31 2026 7:13 PM

 Rybakina Stuns Sabalenka, Clinches 1st Aus Open Title

ఆస్ట్రేలియా ఓపెన్-2026 మహిళల సింగిల్స్ విజేతగా కజకిస్తాన్ స్టార్ ఎలెనా రిబకినా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్ పోరులో ప్రపంచ నంబర్ 1 ఆర్యనా సబలెంకాపై  6-4, 4-6, 6-4 తేడాతో విజయం సాధించిన రిబకినా.. తొలి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.  ఈ ఫైనల్ మ్యాచ్ ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగింది.

తొలి సెట్‌లో నిలకడైన ఆటతో 6-4 తేడాతో రిబకినా గెలచుకుంది. అనంతరం సబలెంకా తన మార్కు పవర్ హిట్టింగ్‌తో పుంజుకుంది. ఈ సెట్‌లో రిబకినాను 6-4 తేడాతో ఓడించిన సబలెంక.. మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో సెట్‌కు తీసుకెళ్లింది. నిర్ణయాత్మక సెట్‌లో కూడా సబలెంకా సత్తా చాటింది. 

వరుస గేమ్‌లు గెలుస్తూ 3-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లి టైటిల్ దిశగా సాగింది. అయితే ఆదే సమయంలో ఎలెనా రిబకినా అద్భుతమైన పోరాట పటిమ కనబరిచింది. సబలెంకా సర్వీస్‌ను వరుసగా రెండుసార్లు బ్రేక్ చేసిన రిబకినా, 6-4 తేడాతో సెట్‌ను సొంతం చేసుకుంది. తద్వారా తొలి ఆసీస్ ఓపెన్ టైటిల్ ఆమె ఖాతాలో చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement