హాంగ్ కాంగ్ సిక్సెస్ 2025 టోర్నమెంట్‌లో భారత జట్టు కథ ముగిసింది. శనివారం(నవంబర్ 8) కువైట్ చేతిలో ఓటమి పాలైన టీమిండియా.. క్వార్టర్-ఫైనల్స్‌కు చేరుకోకుండానే టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. పూల్ సిలో ఉన్న పాకిస్తాన్ (-0.111), కువైట్( (+1.683) కూడా ఒక్కో విజయం సాధించినప్పటికి.. భారత్(-2.256) కంటే మెరుగైన రన్‌రేట్ ఉండడంతో ఆ రెండు జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాయి.
కాగా కువైట్ చేతిలో ఓడి క్వార్టర్ ఫైనల్స్ రేసు నుంచి నిష్క్రమించిన భారత్.. ఆ తర్వాత బౌల్ గ్రూపులో అదే తీరును కనబరిచింది. నాలుగు గ్రూపుల నుంచి క్వార్టర్స్‌కు అర్హత సాధించని జట్లు ఈ బౌల్ గ్రూపులో తలపడతాయి. ఈ క్రమంలో దినేష్ కార్తీక్ సారథ్యంలో భారత జట్టు వరుసగా యూఏఈ, నేపాల్ వంటి పసికూనల చేతిలో పరాజయం పాలైంది.
తొలుత యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 6 ఓవర్లలో 3 వికెట్లకు 107 పరుగులు చేసింది. అనంతరం యూఏఈ 5.5 ఓవర్లలో 2 వికెట్లకు 111 పరుగులు చేసి గెలుపొందింది. అనంతరం నేపాల్‌తో మ్యాచ్‌లో మెన్ ఇన్ బ్లూ ఏకంగా 92 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. ఇక చివరగా ఆదివారం భారత్ తమ చివరి బౌల్ మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడనుంది.
ఆరు ఓవర్లు.. ఆరుగురు ప్లేయర్లు
కాగా హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ ఒక డిఫరెంట్ ఫార్మాట్. ఈ టోర్నీలో ఒక్కో జట్టులో కేవలం ఆరుగురు ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. అంతేకాకుండా ఒక్కో ఇన్నింగ్స్‌కు 6 ఓవర్లు కేటాయిస్తారు. ఈ విభిన్నమైన టోర్నీలో మొత్తం 12 జట్లు బరిలోకి దిగాయి. ఈ 12 జట్లను 4 గ్రూప్‌లుగా విభజించారు.
రౌరౌండ్ రాబిన్ పద్దతిలో ప్రతీ గ్రూప్‌లోని జట్టు.. ఆ గ్రూపులోని మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతోంది. ఆ తర్వాత ప్రతీ గ్రూపు నుంచి రెండు జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఇక క్వార్టర్స్‌లో గెలిచిన జట్టు ప్రధాన సెమీఫైనల్‌కు అర్హత సాధించగా.. ఓడిన జట్టు ప్లేట్ సెమీఫైనల్‌కు క్వాలిఫై అవుతాయి.
అదేవిధంగా లీగ్ స్టేజిలో ఇంటిముఖం పట్టిన జట్లు బౌల్ గ్రూపులో మరోసారి తలపడతాయి. మొత్తంగా మెయిన్ ఫైనల్‌తో పాటు ప్లేట్ ఫైనల్, బౌల్ ఫైనల్ మ్యాచ్‌లు కూడా జరగనున్నాయి.
చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..


