
పాకిస్తాన్ క్రికెట్‌కు మూలపురుషులుగా నిలిచిన మహ్మద్ బ్రదర్స్‌లో ఒకరైన వజీర్ మహ్మద్ (95) ఇవాళ (అక్టోబర్ 13) యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బర్మింగ్‌హామ్‌లో తుదిశ్వాస విడిచారు. వయో భారం కారణంగా వజీర్ కన్నుమూశారు. 1952లో భారత్, పాక్ మధ్య జరిగిన తొలి టెస్ట్ సిరీస్‌లో పాల్గొన్న వజీర్, అప్పటి నుంచి 1959 వరకు 20 టెస్టులు ఆడి 801 పరుగులు చేశారు.
వజీర్ తన కెరీర్‌లో తొలి టెస్ట్ మ్యాచ్‌ను భారత్‌తోనే ఆడారు. ఆ మ్యాచ్‌లో అతను కేవలం 12 పరుగులు మాత్రమే చేసి, రెండు ఇన్నింగ్స్‌ల్లో వినూ మన్కడ్ బౌలింగ్‌లో ఔటయ్యారు.
వజీర్‌కు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మంచి రికార్డు ఉంది. 105 మ్యాచ్‌ల్లో 11 సెంచరీలు, 26 అర్ధ సెంచరీల సాయంతో 4930 పరుగులు చేశారు.
వజీర్ పాక్‌కు ప్రాతినిథ్యం వహించిన నలుగురు మహ్మద్ బ్రదర్స్‌లో ఒకరు. వజీర్ సోదరుడు హనీఫ్ మహ్మద్ క్రికెట్ ప్రపంచానికి సుపరిచితుడు. హనీఫ్ 2016 ఆగస్టు 11న 81 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
వజీర్ మరణించే సమయానికి నీల్ హార్వీ, ట్రెవర్ మెక్‌మహన్ తర్వాత మూడవ అతిపెద్ద వయస్సు గల టెస్ట్ క్రికెటర్‌గా ఉన్నారు.