పాకిస్తాన్‌పై భారత్‌ విజయం.. అక్కడ కూడా భంగపాటే..! | Hong Kong Sixes 2025: India Beat Pakistan By 2 Runs In DLS Method | Sakshi
Sakshi News home page

Hong Kong Sixes 2025: పాకిస్తాన్‌పై భారత్‌ విజయం

Nov 7 2025 2:31 PM | Updated on Nov 7 2025 3:09 PM

Hong Kong Sixes 2025: India Beat Pakistan By 2 Runs In DLS Method

హాంగ్‌కాంగ్‌ సిక్సస్‌ టోర్నీలో (Hong Kong Sixes 2025) పాకిస్తాన్‌పై భారత్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం 2 పరుగుల తేడాతో విజయం సాధించింది.  మాంగ్‌ కాక్‌ వేదికగా ఇవాళ (నవంబర్‌ 7) జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 6 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది.

ఓపెనర్లు రాబిన్‌ ఉతప్ప (11 బంతుల్లో 28; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), భరత్‌ చిప్లి (13 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి ఆడారు. ఆఖర్లో కెప్టెన్‌ దినేశ్‌ కార్తిక్‌ (6 బంతుల్లో 17 నాటౌట్‌; 2 ఫోర్లు, సిక్స్‌) సైతం బ్యాట్‌ ఝులిపించాడు. భారత ఇన్నింగ్స్‌లో స్టువర్ట్‌ బిన్ని 4, మిథున్‌ 6 పరుగులు చేశారు. పాక్‌ బౌలర్లలో ముహమ్మద్‌ షెహజాద్‌ 2, అబ్దుల్‌ సమద్‌ ఓ వికెట్‌ తీశారు.

అనంతరం పాక్‌ 87 పరుగుల లక్ష్య ఛేదనకు దిగగా వరుణుడు అడ్డు పడ్డాడు. వారి స్కోర్‌ 41/1 (3 ఓవర్లు) వద్ద ఉండగా వర్షం మొదలైంది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం​ భారత్‌ను విజేతగా ప్రకటించారు.

మ్యాచ్‌ ముగిసే సమయానికి ఖ్వాజా నఫే (18 నాటౌట్‌), అబ్దుల్‌ సమద్‌ (16 నాటౌట్‌) క్రీజ్‌లో ఉన్నారు. మాజ్‌ సదాఖత్‌ (7) ఔటయ్యాడు. సదాఖత్‌ వికెట్‌ స్టువర్ట్‌ బిన్నికి దక్కింది. ఈ టోర్నీలో భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌లో కువైట్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌ నవంబర్‌ 8న జరుగుతుంది. భారతకాలమానం​ ప్రకారం ఈ మ్యాచ్‌ ఉదయం 6:40 గంటలకు మొదలవుతోంది. 

కాగా, క్రికెట్‌లో పాకిస్తాన్‌పై భారత్‌ గెలవడం ఇటీవలికాలంలో ఇది ఐదోసారి. పహల్గాం ఉదంతం తర్వాత భారత సీనియర్‌ పురుషుల జట్టు పాక్‌ను ఆసియా కప్‌-2025లో మూడు సార్లు ఓడించింది. అనంతరం భారత సీనియర్‌ మహిళల జట్టు వన్డే ప్రపంచకప్‌లో పాక్‌ను చిత్తు చేసింది. తాజాగా సూపర్‌ సిక్సస్‌ టోర్నీలోనూ పాక్‌కు భారత్‌ చేతిలో భంగపాటు ఎదురైంది.

చదవండి: పాకిస్తాన్‌ కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement