
టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) మరోసారి ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. మహీక శర్మ (Mahieka Sharma) అనే మోడల్‌తో అతడు డేటింగ్ చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పుడు వాటినే నిజం చేస్తూ హార్దిక్ పాండ్యా మహీకతో దిగిన వ్యక్తిగత ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు.
చేతిలోన చెయ్యేసి
బీచ్ ఒడ్డున నిలబడి మహీకతో కలిసి ప్రకృతిని ఆస్వాదిస్తున్న ఫొటోలతో పాటు.. ఇద్దరూ చేతిలో చేయి వేసుకుని దిగిన బ్లాక్ అండ్ వైట్ ఫొటోలను హార్దిక్ పంచుకున్నాడు. తద్వారా తాను మహీకతో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని చెప్పకనే చెప్పాడు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
కాగా హార్దిక్ పాండ్యా శనివారం 32వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఇలా పుట్టినరోజుకు ఒకరోజు ముందే అంటే శుక్రవారమే మహీక శర్మతో కలిసి హార్దిక్ ట్రిప్పునకు వెళ్లినట్లు తెలుస్తోంది. వీరిద్దరు ముంబై ఎయిర్‌పోర్టుకు వచ్చిన దృశ్యాలు నిన్న వైరల్ అయ్యాయి.
గతంలో నటాషా స్టాంకోవిక్‌ను ప్రేమించిన హార్దిక్
ఇక హార్దిక్ పాండ్యా షేర్ చేసిన ఫొటోల్లో కుమారుడు అగస్త్యతో కలిసి ఉన్న చిత్రం కూడా ఉండటం విశేషం. కాగా సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిక్‌ను ప్రేమించిన హార్దిక్ పాండ్యా కోవిడ్ సమయంలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లైన కొన్ని నెలల్లోనే కుమారుడు అగస్త్య జన్మించాడు.
విడాకులు
అయితే, 2023, ఫిబ్రవరి 14న హార్దిక్ నటాషాకు ఊహించని బహుమతి ఇచ్చాడు. ఉదయ్‌పూర్‌లో గ్రాండ్ వెడ్డింగ్ ఏర్పాటు చేశాడు. హిందూ- క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతుల్లో వీరిద్దరు మరోసారి పెళ్లినాటి ప్రమాణాలు చేశారు. అయితే, గతేడాదే అనూహ్య రీతిలో తాము విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు హార్దిక్- నటాషా.
ఇప్పుడిలా హార్దిక్ పాండ్యా మరోసారి ప్రేమలో పడ్డాడు. కాగా టీమిండియా తరఫున చివరగా ఆసియా టీ20 కప్-2025 ఆడిన ఈ పేస్ ఆల్‌రౌండర్.. ఈ టోర్నీ సందర్భంగా గాయపడ్డాడు. దీంతో అతడు ఆస్ట్రేలియా పర్యటనకు కూడా దూరమయ్యాడు. ప్రస్తుతం ఇలా వ్యక్తిగత జీవితాన్ని హార్దిక్ పాండ్యా గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు.
చదవండి: యువీ తల్లిని పెళ్లి చేసుకుని తప్పు చేశా.. ఆమెను ఇంట్లో పెట్టి తాళం వేసేవాడిని!