ఫైనల్‌ లక్ష్యంగా... | Indias semi final match with Bangladesh today | Sakshi
Sakshi News home page

ఫైనల్‌ లక్ష్యంగా...

Jul 26 2024 4:25 AM | Updated on Jul 26 2024 4:25 AM

Indias semi final match with Bangladesh today

నేడు బంగ్లాదేశ్‌తో భారత్‌ సెమీఫైనల్‌ పోరు

మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–3లో ప్రత్యక్ష ప్రసారం  

దంబుల్లా: ఆసియా కప్‌ టి20 క్రికెట్‌ టోర్నీలో  జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారత మహిళల జట్టు ఇప్పుడు ఫైనల్‌ వేటలో పడేందుకు సిద్ధమైంది. నేడు జరిగే తొలి సెమీఫైనల్లో గ్రూప్‌ ‘ఎ’ టాపర్, డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌... గ్రూప్‌ ‘బి’లో రెండో స్థానంలో నిలిచిన బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. రాత్రి ఏడు గంటలకు జరిగే రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్‌తో ఆతిథ్య శ్రీలంక జట్టు ఆడుతుంది.  

అజేయంగా హర్మన్‌సేన 
ఈ టోర్నీలో ‘హ్యాట్రిక్‌’ విజయాలతో అజేయంగా దూసుకెళ్తున్న భారత్‌ ఇక నాకౌట్‌ దశలోనూ ఇదే జోరును కొనసాగించాలనే లక్ష్యంతో ఉంది. ఓపెనర్లలో షఫాలీ వర్మ సూపర్‌ ఫామ్‌లో ఉండటం జట్టు విజయాలకు దోహదం చేస్తోంది. మరో స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన, హేమలతలతో టాపార్డర్‌ పటిష్టంగా ఉంది. కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్‌లు కూడా రాణిస్తుండటంతో బ్యాటింగ్‌ ఆర్డర్‌కు ఏ ఢోకా లేదు. 

లోయర్‌ ఆర్డర్‌లో దీప్తి శర్మ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కీలకంగా మారింది. రేణుకా సింగ్, పూజ వస్త్రకర్‌ నిలకడగా వికెట్లు తీస్తున్నారు. ముఖ్యంగా ఈ టోర్నీలో గట్టి ప్రత్యర్థి అయిన పాకిస్తాన్‌ను కట్టడి చేయడంలో ఈ ముగ్గురు కీలకపాత్ర పోషించారు. యూఏఈ, నేపాల్‌లపై భారీస్కోర్లు సాధించిన భారత మహిళల జట్టు ఈ నాకౌట్‌ దశలోనూ బంగ్లాదేశ్‌పై మరోభారీ స్కోరును నమోదు చేస్తే మిగతా పనిని బౌలర్లు సమర్థంగా పూర్తి చేస్తారు.  

సర్వశక్తులు ఒడ్డేందుకు... 
మరోవైపు బంగ్లాదేశ్‌ కూడా ఫైనల్‌ కోసం గట్టి పోరాటానికే సన్నద్ధమైంది. పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న భారత్‌ మెడకు తమ స్పిన్‌ ఉచ్చు బిగించాలని చూస్తోంది. లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ నహిదా అక్తర్, లెగ్‌ స్పిన్నర్‌ రబియా ఖాన్‌లు ఈ టోరీ్నలో చక్కగా రాణించారు. 

సెమీస్‌ మ్యాచ్‌లో పిచ్‌ ఏమాత్రం అనుకూలించినా... తమ మాయాజాలంతో భారత బ్యాటర్ల ఆటకట్టించే ఎత్తుగడలతో పాక్‌ సేన ఉంది. మలేసియాతో ఆడిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో బంగ్లా భారీస్కోరు (191/2) నమోదు చేసింది. టాపార్డర్‌ బ్యాటర్లు ముర్షిదా, దిలార, కెపె్టన్‌ నిగర్‌ సుల్తానా ఫామ్‌లోకి రావడం బంగ్లా శిబిరానికి కలిసొచ్చే అంశం. 

జట్లు (అంచనా) 
భారత మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్‌), షఫాలీ, స్మృతి మంధాన, హేమలత, జెమీమా, రిచాఘో‹Ù, దీప్తిశర్మ, అరుంధతి, రాధాయాదవ్, తనూజ, రేణుకా సింగ్‌. 
బంగ్లాదేశ్‌ మహిళల జట్టు: నిగర్‌ సుల్తానా (కెపె్టన్‌), ముర్షిదా, దిలార  రుమానా, ఇష్మా తంజిమ్, రీతు మోని, రబియా, షోర్న, నహిదా, సబికున్‌ జాస్మిన్, జహనారా.  

Advertisement
 
Advertisement
Advertisement