సెమీఫైనల్లో సాకేత్‌–రామ్‌ జోడీ | Seoul Open Saketh Myneni Ramkumar in semis | Sakshi
Sakshi News home page

సెమీఫైనల్లో సాకేత్‌–రామ్‌ జోడీ

Nov 2 2024 3:09 AM | Updated on Nov 2 2024 3:09 AM

Seoul Open Saketh Myneni Ramkumar in semis

సాక్షి, హైదరాబాద్‌: సియోల్‌ ఓపెన్‌ ఏటీపీ–100 చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ సాకేత్‌ మైనేని–రామ్‌కుమార్‌ రామనాథన్‌ (భారత్‌) జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఈ టోరీ్నలో పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాకేత్‌–రామ్‌కుమార్‌ జంట 6–3, 6–1తో యోంగ్‌ సియోక్‌ జియోంగ్‌–యుసంగ్‌ పార్క్‌ (దక్షిణ కొరియా) జోడీపై గెలిచింది. 

59 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్‌–రామ్‌ జంట నాలుగు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగు సార్లు బ్రేక్‌ చేసింది. నేడు జరిగే సెమీఫైనల్లో జిసుంగ్‌ నామ్‌ (దక్షిణ కొరియా)–జోషువా పారిస్‌ (బ్రిటన్‌) జంటతో సాకేత్‌–రామ్‌కుమార్‌ ద్వయం ఆడుతుంది. 

ఇదే టోర్నీలో ఆడుతున్న హైదరాబాద్‌ ప్లేయర్‌ అనిరుధ్‌ చంద్రశేఖర్‌ భారత్‌కే చెందిన తన భాగస్వామి నిక్కీ కలియంద పూనాచా జోడీ పోరాటం ముగిసింది. క్వార్టర్‌ ఫైనల్లో మూడో సీడ్‌ అనిరు«ద్‌–నిక్కీ జంట 1–6, 3–6తో జిసుంగ్‌ నామ్‌ (దక్షిణ కొరియా)–జోషువా పారిస్‌ (బ్రిటన్‌) జోడీ చేతిలో ఓడిపోయింది.    
 

Advertisement
 
Advertisement
Advertisement