తమిళనాడు 146 ఆలౌట్‌ 

Tamil Nadu 146 all out - Sakshi

ముంబై 45/2 

రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్‌  

ముంబై: రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో ముంబై సమష్టి బౌలింగ్‌ ప్రదర్శనతో తమిళనాడును పడగొట్టింది. మ్యాచ్‌ తొలి రోజు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 64.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. విజయ్‌ శంకర్‌ (44), వాషింగ్టన్‌ సుందర్‌ (43) కొంత పోరాడినా...మిగతావారంతా విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో తుషార్‌ పాండే 24 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా...      తనుష్‌ కొటియాన్, ముషీర్‌ ఖాన్, శార్దుల్‌ ఠాకూర్‌ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం ముంబై బ్యాటింగ్‌ కూడా తడబడింది.

శనివారం ఆట ముగిసే సమయానికి ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది. పృథ్వీ షా (5) విఫలం కాగా...ముïÙర్‌ ఖాన్‌ (24 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నాడు. రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఆడని కారణంగా బీసీసీఐ కాంట్రాక్ట్‌ను కోల్పోయిన భారత బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఈ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు.
  
విదర్భ 170 ఆలౌట్‌... 

నాగ్‌పూర్‌: మధ్యప్రదేశ్‌ పేస్‌ బౌలర్‌ అవేశ్‌ ఖాన్‌ (4/49) పదునైన బౌలింగ్‌ ముందు విదర్భ బ్యాటర్లు విఫలమయ్యారు. రంజీ ట్రోఫీ రెండో సెమీస్‌ మ్యాచ్‌లో విదర్భ తమ తొలి ఇన్నింగ్స్‌లో 56.4 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది.

కరుణ్‌ నాయర్‌ (63) అర్ధ సెంచరీ సాధించగా, అథర్వ తైడే (39) ఫర్వాలేదనిపించాడు. ఒక దశలో 101/2తో మెరుగైన స్థితిలో కనిపించిన విదర్భ 36 పరుగుల వ్యవధిలో తర్వాతి 6 వికెట్లు కోల్పోయింది. వెంకటేశ్‌ అయ్యర్, కుల్వంత్‌ ఖెజ్రోలియా చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆట ముగిసే సరికి మధ్యప్రదేశ్‌ వికెట్‌ నష్టానికి 47 పరుగులు చేసింది.  

whatsapp channel

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top