సూపర్‌-8లో గ్రూప్‌-2 బెర్త్‌లు ఖరారు | T20 World Cup 2024 Super 8 Group 2 Berths Confirmed | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: సూపర్‌-8లో గ్రూప్‌-2 బెర్త్‌లు ఖరారు

Published Sun, Jun 16 2024 11:16 AM | Last Updated on Sun, Jun 16 2024 11:40 AM

T20 World Cup 2024 Super 8 Group 2 Berths Confirmed

టీ20 వరల్డ్‌కప్‌ 2024 గ్రూప్‌-2కు సంబంధించిన సూపర్‌-8 బెర్త్‌లు ఖరారయ్యాయి. నమీబియాపై ఇంగ్లండ్‌.. స్కాట్లాండ్‌పై ఆస్ట్రేలియా విజయాలు సాధించడంతో గ్రూప్‌-బిలో రెండో బెర్త్‌ ఖరారైంది. ఈ గ్రూప్‌ నుంచి నెట్‌ రేట్‌ ఆధారంగా ఇంగ్లండ్‌ సూపర్‌-8 రెండో బెర్త్‌ ఖరారు చేసుకుగా.. ఆసీస్‌ ఇదివరకే గ్రూప్‌-బి నుంచి సూపర్‌-8కు అర్హత సాధించింది.

సూపర్‌-8 గ్రూప్‌ 2లో గ్రూప్‌-ఏ నుంచి యూఎస్‌ఏ (A2).. గ్రూప్‌-బి నుంచి ఇంగ్లండ్‌ (B2).. గ్రూప్‌-సి నుంచి వెస్టిండీస్‌ (C2).. గ్రూప్‌-డి నుంచి సౌతాఫ్రికా (D1) జట్లు ఉన్నాయి. గ్రూప్‌-2లోని ఈ నాలుగు జట్లు మిగతా మూడు జట్లతో తలో మ్యాచ్‌ ఆడతాయి. అన్ని మ్యాచ్‌లు ముగిశాక మొదటి రెండు స్థానాల్లో ఉండే జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.

సూపర్‌-8లో గ్రూప్‌-2 మ్యాచ్‌లు..

జూన్‌ 19- యూఎస్‌ఏ వర్సెస్‌ సౌతాఫ్రికా (ఆంటిగ్వా)
జూన్‌ 19- ఇంగ్లండ్‌ వర్సెస్‌ వెస్టిండీస్‌ (సెయింట్‌ లూసియా)
జూన్‌ 21- ఇంగ్లండ్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా (సెయింట్‌ లూసియా)
జూన్‌ 21- యూఎస్‌ఏ వర్సెస్‌ వెస్టిండీస్‌ (బార్బడోస్‌)
జూన్‌ 23- యూఎస్‌ఏ వర్సెస్‌ ఇంగ్లండ్‌ (బార్బడోస్‌)
జూన్‌ 23- వెస్టిండీస్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా (ఆంటిగ్వా)

ఇదిలా ఉంటే, సూపర్‌-8 గ్రూప్‌-1కు సంబంధించిన బెర్త్‌లు కూడా దాదాపుగా ఖరారయ్యాయి. గ్రూప్‌-1లో గ్రూప్‌-ఏ నుంచి భారత్‌ (A1).. గ్రూప్‌-బి నుంచి ఆస్ట్రేలియా (B1).. గ్రూప్‌-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్‌ (C1).. గ్రూప్‌-డి నుంచి బంగ్లాదేశ్‌ లేదా నెదర్లాండ్స్‌ (D2) జట్లు ఉంటాయి. ఇవాళ (జూన్‌ 16) జరిగే గ్రూప్‌-డి మ్యాచ్‌లో నేపాల్‌పై విజయం సాధిస్తే బంగ్లాదేశ్‌ సూపర్‌-8కు (గ్రూప్‌-1) అర్హత సాధిస్తుంది.

సూపర్‌-8లో గ్రూప్‌-1 మ్యాచ్‌లు..

జూన్‌ 20- ఆఫ్ఘనిస్తాన్‌ వర్సెస్‌ ఇండియా (బార్బడోస్‌)
జూన్‌ 20- ఆస్ట్రేలియా వర్సెస్‌ D2 (బంగ్లాదేశ్‌ లేదా నెదర్లాండ్స్‌) (ఆంటిగ్వా)
జూన్‌ 22- ఇండియా వర్సెస్‌ D2 (బంగ్లాదేశ్‌ లేదా నెదర్లాండ్స్‌) (ఆంటిగ్వా)
జూన్‌ 22- ఆఫ్ఘనిస్తాన్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా (సెయింట్‌ విన్సెంట్‌)
జూన్‌ 24- ఆస్ట్రేలియా వర్సెస్‌ ఇండియా (సెయింట్‌ లూసియా)
జూన్‌ 24- ఆఫ్ఘనిస్తాన్‌ వర్సెస్‌ D2 (బంగ్లాదేశ్‌ లేదా నెదర్లాండ్స్‌) (సెయింట్‌ విన్సెంట్‌)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement