ICC Womens WC 2022: టీమిండియా సెమీస్‌కు చేరాలంటే..?

Womens WC 2022 What Team India Need Qualify Semis After Win Vs Bangladesh - Sakshi

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ 2022లో భాగంగా మంగళవారం టీమిండియా, బంగ్లాదేశ్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా మహిళల జట్టు ఆకట్టుకునే ప్రదర్శనతో సెమీస్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ప్రస్తుతం టీమిండియా ఆరు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు.. మూడు ఓటములతో ఆరు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌పై 110 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి నెట్‌రన్‌రేట్‌ను కూడా మెరుగుపరుచుకుంది.

బంగ్లాతో మ్యాచ్‌కు ముందు మైనస్‌లో ఉన్న రన్‌రేట్‌.. ఇప్పుడు +0.768గా ఉంది. కాగా సెమీస్‌లో మూడు, నాలుగు స్థానాల కోసం ఇంగ్లండ్‌, భారత్‌, వెస్టిండీస్‌ పోటీపడుతున్నాయి. ఇంగ్లండ్‌కు రెండు మ్యాచ్‌లు ఉన్నప్పటికి నాలుగు పాయింట్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఆ జట్టు తాను ఆడబోయే రెండు మ్యాచ్‌లు కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. 

ఇక ఆదివారం(మార్చి 27న) సౌతాఫ్రికాతో జరగనున్న మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే సమీకరణాలు అవసరం లేకుండా  8 పాయింట్లతో సెమీస్‌లో అడుగుపెడుతుంది. ఒకవేళ సాతాఫ్రికాతో మ్యాచ్‌లో ఓడినప్పటికి మరో అవకాశం ఉంది. టీమిండియాతో మ్యాచ్‌కు ముందు సౌతాఫ్రికా వెస్టిండీస్‌తో మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో గనుక వెస్టిండీస్‌ ఓడిపోతే.. టీమిండియా సెమీస్‌కు చేరుకుంటుంది.

అలా కాకుండా వెస్టిండీస్‌ గెలిస్తే టీమిండియాకు నెట్‌రన్‌రేట్‌ కీలకం కానుంది. సౌతాఫ్రికాతో మ్యచ్‌లో టీమిండియా ఓడినప్పటికి.. తక్కువ పరుగుల తేడాతో ఓడిపోవాలి. అప్పుడే నెట్‌ రన్‌రేట్‌ ఆధారంగా సెమీస్‌కు వెళుతుంది. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మనతో మ్యాచ్‌కు ముందు సౌతాఫ్రికా వెస్టిండీస్‌ను ఓడిస్తే సరిపోతుంది. 

చదవండి: PAK vs AUS: బాబర్ ఆజం.. కేవలం రికార్డుల కోసమే టెస్టు సిరీస్‌​ ఆడుతున్నావా?

World Cup 2022: అరుదైన రికార్డు సాధించిన గోస్వామి.. తొలి భారత బౌలర్‌గా!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top