
జపాన్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్ అల్‌కరాజ్ (స్పెయిన్) సెమీఫైనల్‌కు చేరాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ అల్‌కరాజ్ 6–2, 6–4తో బ్రాండన్ నకషీమా (అమెరికా)పై గెలిచాడు. మ్యాచ్ ఆరంభం నుంచి ఆధిపత్యం కనబర్చిన ఈ యంగ్‌స్టర్... వరుస సెట్లలో ప్రత్యర్థిని మట్టికరిపించాడు.
ఈ సీజన్‌లో అల్‌కరాజ్‌కు ఇది 65వ విజయం కావడం విశేషం. 2023 ఏటీపీ టూర్‌లో సైతం 65 మ్యాచ్‌లు గెలిచిన అల్‌కరాజ్... ఇప్పుడు మరోసారి ఆ ఘనత సాధించాడు. ‘మరో సెమీఫైనల్‌కు చేరడం ఆనందంగా ఉంది. జపాన్‌లో తొలి సారి ఆడుతున్నా. మొదటిసారే సెమీస్‌కు చేరుకోవడం చక్కటి ఉత్సాహాన్నిచ్చింది’అని 22 ఏళ్ల అల్‌కరాజ్ అన్నాడు. సెమీస్‌లో నాలుగో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే)తో అల్‌కరాజ్ ఆడతాడు.