ట్యూరిన్ (ఇటలీ): పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ కార్లోస్ అల్‌కరాజ్ (స్పెయిన్) శుభారంభం చేశాడు. టాప్–8 ర్యాంకర్ల మధ్య ఆదివారం ఈ మెగా టోర్నీ మొదలైంది. ‘జిమీకానర్స్ గ్రూప్’ తొలి లీగ్ మ్యాచ్‌లో అల్‌కరాజ్ 7–6 (7/5), 6–2తో ఏడో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆ్రస్టేలియా)పై గెలుపొందాడు.
1 గంట 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అల్‌కరాజ్ ఐదు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. ‘జిమ్మీ కానర్స్ గ్రూప్’లోనే టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా), ముసెట్టి (ఇటలీ) కూడా ఉన్నారు. ‘జాన్ బోర్గ్ గ్రూప్’లో ప్రపంచరెండో ర్యాంకర్ సినెర్ (ఇటలీ), జ్వెరెవ్ (జర్మనీ), బెన్ షెల్టన్ (అమెరికా), ఫెలిక్స్ (కెనడా) ఉన్నారు.


