World Cup 2022: అరుదైన రికార్డు సాధించిన గోస్వామి.. తొలి భారత బౌలర్‌గా!

Jhulan Goswami shatters a flurry of record  - Sakshi

మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత స్టార్‌  అరుదైన రికార్డు సాధించింది. ప్రపంచకప్‌లో 30 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా ఝులన్ గోస్వామి నిలిచింది. హామిల్టన్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టిన గోస్వామి ఈ ఘనత సాధించింది. ఇక వన్డే ఫార్మాట్‌లో 250 వికెట్లు తీసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా గోస్వామి నిలిచిన సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. బంగ్లాదేశ్‌పై 110 పరుగుల భారీ తేడాతో భారత్‌ విజయం సాధించింది. 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ జట్టు 119 పరగులకే కుప్పకూలింది.

భారత బౌలర్లలో స్నేహ్‌ రాణా నాలుగు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్‌ను దెబ్బతీసింది. అదే విధంగా ఝులన్‌ గోస్వామి,పూజా వస్త్రాకర్‌ చెరో రెండు వికెట్లు సాధించి తమ వంతు పాత్ర పోషించారు.అంతకుముందు భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన(30), షఫాలీ వర్మ(42) రాణించగా.. యస్తికా భాటియా అర్ధ శతకంతో జట్టు మెరుగైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించింది.

చదవండి: World Cup 2022: ఎదురులేని ఆసీస్‌.. కెప్టెన్‌ 15వ సెంచరీ.. అద్భుత విజయం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top