దక్షిణాఫ్రికాతో భారత్‌ సెమీస్‌ పోరు.. | Sakshi
Sakshi News home page

U-19 World Cup 2024: దక్షిణాఫ్రికాతో భారత్‌ సెమీస్‌ పోరు..

Published Tue, Feb 6 2024 7:12 AM

India vs South Africa U-19 World Cup Semi-final Preview - Sakshi

అండర్‌–19 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ ఆతిథ్య దక్షిణాఫ్రికాతో సెమీఫైనల్‌ పోరుకు సిద్ధమైంది. 1988లో మొదలైన అండర్‌–19 ప్రపంచకప్‌ల చరిత్రలో అత్యధికంగా 8 సార్లు ఫైనల్‌ చేరిన భారత్‌... 2000, 2008, 2012, 2018, 2022లలో ఐదుసార్లు విజేతగా నిలిచింది. ఉదయ్‌ సహరన్‌ నేతృత్వంలోని యువ జట్టు ఆల్‌రౌండ్‌ నైపుణ్యంతో ఉంది.

ఈ టోర్నీలో వరుసగా ఐదు విజయాలు సాధించింది. ఈ మెగా ఈవెంట్‌కు ముందు సన్నాహకంగా ఆడిన ముక్కోణపు సిరీస్‌లో సఫారీ జట్టును భారత్‌ రెండు వన్డేల్లో ఓడించింది. కీలకమైన సెమీస్‌కు ముందు యువ భారత్‌ ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశమిది. ఇదే సమరోత్సాహంతో ఆతిథ్య దక్షిణాఫ్రికాను మట్టికరిపించాలనే పట్టుదలతో ఉంది.

బ్యాటింగ్‌లో ముషీర్‌ ఖాన్, కెప్టెన్‌ ఉదయ్, సచిన్‌ దాస్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో సౌమీ కుమార్‌ పాండే, నమన్‌ తివారి, రాజ్‌ లింబానిలు కూడా నిలకడగా రాణిస్తుండటం జట్టును పటిష్టంగా నిలిపింది. మధ్యాహ్నం 1.30 గంటలకు మొదలయ్యే ఈ సెమీస్‌ పోరును స్టార్‌స్పోర్ట్స్‌ ప్రసారం చేస్తుంది. 

Advertisement
 
Advertisement