టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ 2024.. ఐసీసీ కీల‌క నిర్ణ‌యం!? అలా అయితే క‌ష్ట‌మే | Sakshi
Sakshi News home page

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ 2024.. ఐసీసీ కీల‌క నిర్ణ‌యం!? అలా అయితే క‌ష్ట‌మే

Published Tue, May 14 2024 6:19 PM

No reserve day for second semifinal, playing conditions announced

ఐపీఎల్‌-2024 ముగిసిన వారం రోజుల‌కే మ‌రో క్రికెట్ మ‌హాసంగ్రామానికి తెర‌లేవ‌నుంది. జూన్ 1 నంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదిక‌గా టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024 ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డ‌ల్లాస్ వేదిక‌గా అమెరికా, కెన‌డా జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి.

అయితే ఈ మెగా ఈవెంట్‌కు స‌బంధించి ఓ ఆస‌క్తికర‌ వార్త తెర‌పైకి వ‌చ్చింది.  ఈ మెగా టోర్నీలో సెకెండ్ సెమీఫైన‌ల్‌కు రిజర్వ్ డే ఉండదని ప్ర‌ముఖ క్రికెట్ వెబ్‌సైట్‌ క్రిక్‌బజ్ త‌మ రిపోర్ట్‌లో పేర్కొంది. సాధ‌ర‌ణంగా ఐసీసీ ఈవెంట్‌ల‌లో నాకౌట్ గేమ్‌లకు రిజర్వ్ డే క‌చ్చితంగా ఉంటుంది. 

కానీ ఈ ఏడాది టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ షెడ్యూల్ ప్ర‌కారం.. రెండో సెమీఫైన‌ల్‌కు, ఫైన‌ల్ పోరుకు మ‌ధ్య కేవ‌లం ఒక రోజు మాత్రమే గ్యాప్ ఉంది. ఈ క్ర‌మంలోనే ఐసీసీ సెకెండ్ సెమీఫైన‌ల్‌కు రిజ‌ర్వ్‌డేను కెటాయించ‌లేద‌ని క్రిక్‌బజ్ తెలిపింది. 

అయితే రిజ‌ర్వ్ డే బ‌ద‌లుగా 250 నిమిషాల అదనపు సమయాన్ని ఐసీసీ, వెండీస్ క్రికెట్ బోర్డులు కెటాయించిన‌ట్లు తెలుస్తోంది. గ‌యానా వేదిక‌గా రెండో సెమీఫైన‌ల్ జ‌ర‌గ‌నుంది. 

ఒక‌వేళ ఈ మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం క‌లిగించే నిర్ణీత స‌మ‌యంలో మ్యాచ్ ఫినిష్ కాక‌పోతే.. మ‌రో నాలుగు గంట‌ల స‌మ‌యాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు. అంటే అంపైర్‌లు మ్యాచ్‌ను ముగించడానికి దాదాపు ఎనిమిది గంటల స‌మ‌యం ఉంటుంది.

Advertisement
Advertisement