![Tennis Star Tommy Paul Girlfriend Goes TOPLESS in Australia Viral - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/26/Tommy.jpg.webp?itok=_J68GDyq)
అమెరికా టెన్నిస్ స్టార్ టామీ పాల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో అదరగొడుతున్నాడు. బుధవారం క్వార్టర్ ఫైనల్లో బెన్ షెల్టన్‌ను టామీ పాల్ 7-6, 6-3, 5-7, 6-4తో ఓడించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఈ ప్రదర్శనతో టామీ పాల్ భవిష్యత్తు స్టార్‌గా మారే అవకాశం ఉన్నట్లు టెన్నిస్ అభిమానులు పేర్కొంటున్నారు. అయితే ఇతని పోరాటం సెమీస్‌లోనే ముగిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌తో టామీ పాల్ సెమీస్ మ్యాచ్ ఆడాల్సి ఉంది.
ఇక టామీ పాల్ గర్ల్‌ఫ్రెండ్ పెయిజ్ లోరెన్జ్ మాత్రం అతని కంటే ముందే హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ఆటతో అనుకుంటే పొరపాటే. బాయ్‌ఫ్రెండ్‌తో పాటు ఆస్ట్రేలియా వచ్చిన ఈ అమ్మడు టాప్‌లెస్‌గా దర్శనమిచ్చి కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. తన బాయ్‌ఫ్రెండ్ ఆడే మ్యాచ్‌లకు పక్కాగా హాజరవుతున్న పెయిజ్ లోరెన్జ్ ఖాళీ సమయంలో బీచ్‌కు వెళ్లి అందాల ప్రదర్శనతో కనువిందు చేస్తుంది.
దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. తన బాయ్‌ఫ్రెండ్ టామీ పాల్.. బెన్ షెల్టన్‌తో ఆడిన క్వార్టర్స్ మ్యాచ్ ఫోటోలను కూడా పంచుకుంది. తన గర్ల్‌ఫ్రెండ్ టాప్‌లెస్ ఫోజుపై టామీ పాల్ స్పందించాడు.. ''అలా నావైపు చూడకు ఏదో అవుతుంది నాకు'' అంటూ కామెంట్ చేశాడు. ఇక పెయిజ్ లోరెన్జ్ టాప్‌లెస్ ఫోటోలపై అభిమానులు వినూత్న రీతిలో కామెంట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment