Photo Credit: Twitter
'తన కోపమే తన శత్రువు' అని సుమతీ శతకంలో చెప్పిన పద్యం.. రష్యా టెన్నిస్ స్టార్ డానిల్ మెద్వెదెవ్‌కు సరిగ్గా సరిపోతుందనడంలో సందేహం లేదు. చిరాకులో చేసిన చిన్న తప్పిదానికి భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆ మూల్యం విలువ ఎంతంటే.. ఏకంగా టోర్నీ నుంచి డిస్‌క్వాలిఫై అయ్యేదాకా వెళ్లింది.
విషయంలోకి వెళితే.. చైనా టెన్నిస్ ఓపెన్‌లో భాగంగా సోమవారం సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్‌తో మెద్వెదెవ్ సెమీఫైనల్లో తలపడ్డాడు. అప్పటికే తొలి సెట్‌ను 5-7తో జకోవిచ్‌కు కోల్పోయిన మెద్వెదెవ్ రెండో సెట్‌లోనూ వెనుకంజలో ఉన్నాడు. దీంతో జొకోవిచ్ సర్వీస్ చేసిన బంతి తనవైపుకు రాగా మెద్వెదెవ్ దానిని మిస్ చేయడంతో జొకోవిచ్‌కు ఒక పాయింట్ లబించింది.
అనంతరం బంతి వెనక్కి వెళ్లి మళ్లీ మెద్వెదెవ్ వైపుకే తిరిగి వచ్చింది. అప్పటికే చిరాకులో ఉన్న మెద్వెదెవ్ నిరాశతో బంతిని కోర్టు వెనుక వైపుకు బలంగా కొట్టాడు. దీంతో స్టాండ్స్‌లోని మొదటి వరుసలోకి దూసుకెళ్లిన బంతి అక్కడ కూర్చున్న ఒక ప్రేక్షకుడి ఎడమ కంటికి తగిలింది. బంతి బలంగా తాకడంతో రక్తం దారలా కారడంతో సదరు అభిమాని నొప్పితో విల్లవిల్లాడిపోయారు.
ప్రథమ చికిత్స అనంతరం ఆ అభిమానిని మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడి నుంచి బయటికి తీసుకెళ్లారు. వెంటనే స్టేడియంలోకి వచ్చిన అధికారులు మెద్వెదెవ్‌తో మాట్లాడి ఆటను నిలిపివేశారు. రూల్స్‌కు విరుద్ధంగా ప్రవర్తించినందుకు మెద్వెదెవ్‌ను మ్యాచ్ నుంచి డిస్‌క్వాలిఫై చేశారు. మెద్వెదెవ్ డిస్ క్వాలిఫై కావడంతో జొకోవిచ్ ఫైనల్ చేరుకున్నట్లు ప్రకటించారు. తాను చేసిన పనికి మెద్వెదెవ్ చింతిస్తూ మైదానం నుంచి భారంగా నిష్క్రమించాడు.
మ్యాచ్ అనంతరం జొకోవిచ్ మాట్లాడుతూ.. "నిజం చెప్పాలంటే ఇది బాధాకరం. ఆ వ్యక్తికి తీవ్రమైన గాయాలు కాలేదని ఆశిస్తున్నా. కానీ అదే సమయంలో, డానిల్ పట్ల నాకు బాధగా ఉంది. అతను ఉద్దేశపూర్వకంగా అలా చేసి ఉండడని నేను ఖచ్చితంగా చెప్పగలను,ష అని తెలిపాడు.
కాగా ఈ విజయంతో ఫైనల్ చేరిన జొకోవిచ్ చైనా ఓపెన్‌లో తన అసాధారణ రికార్డును 33-0కి పెంచుకున్నాడు. 2009 నుంచి 2015 మధ్య జొకోవిచ్ ఆరుసార్లు చైనా ఓపెన్ టైటిల్ గెలుచుకున్నాడు. నేడు జరగనున్న ఫైనల్లో ఆస్ట్రేలియా స్టార్ మినార్‌ను జొకోవిచ్ ఓడిస్తే 2026 సీజన్‌లో అతడికి తొలి టైటిల్ కానుంది. అంతేకాదు చైనా ఓపెన్ గెలిస్తే జొకోవిచ్ ఖాతాలో 102వ ఏటీపీ టైటిల్ కానుంది.
Not the ending we expected 😮 @DjokerNole advances to the Beijing final after Medvedev is defaulted whilst down 5-7 3-5 #ChinaOpen https://t.co/Pae5eNrJ6W
— Tennis TV (@TennisTV) October 5, 2026


