అమెరికాలోని రెడ్‌వుడ్ సిటీలో జరుగుతున్న సిలీకాన్ వ్యాలీ ఓపెన్ గోల్డ్ లెవెల్ అంతర్జాతీయ టోర్నీలో భారత స్క్వాష్ సంచలనం అనాహత్ సింగ్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 15వ ర్యాంకర్ అనాహత్ 3-2( 4-11, 11-8,4-11, 11-2, 11-5) తేడాతో ప్రపంచ 14వ ర్యాంకర్ సల్మా హనీ (ఈజిప్ట్)ని చిత్తుగా ఓడించింది.
తద్వారా గోల్డ్ లెవెల్ టోర్నీలో సెమీస్‌లో అడుగుపెట్టిన తొలి భారత ప్లేయర్‌గా అనాహత్ సింగ్ చరిత్ర సృష్టించింది. ఇక సెమీస్‌లో అనాహత్.. మలేషియాకు చెందిన ప్రపంచ నాలుగో ర్యాంకర్ శివసంగారి సుబ్రమణియమ్‌ను ఎదుర్కోనుంది. కాగా ఇటీవలే జరిగిన ఆసియా గేమ్స్‌లో అనాహత్ ఫైనల్లో సుబ్రమణియమ్ చేతిలో ఓటమిపాలై రజతానికి పరిమితమైంది.
అంతకముందు గురువారం ఉదయం జరిగిన రెండో రౌండ్‌లో అనాహత్ తన కెరీర్‌లోనే అతిపెద్ద, అతిగొప్ప విజయాన్ని నమోదు చేసుకుంది. ఈజిప్ట్ దిగ్గజం, వరుసగా 8 సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన నూర్ ఎల్ షెర్బినిపై అనాహత్ వరుస గేముల్లో గెలిచి పెను సంచలనం సృష్టించింది.
రెండో రౌండ్‌లో అనాహత్ ఈ అద్భుతం చేసింది. 18 ఏళ్ల అనాహత్ 30 నిమిషాల్లో 11–8, 11–8, 11–7తో టాప్ సీడ్, ప్రపంచ 3వ ర్యాంకర్ నూర్ షెర్బినిని బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
Indian teenage sensation @Anahat_Singh13 reacts to becoming the first Indian female player to reach a Gold event semi-final since 2019 ⭐️ https://t.co/KZ2ngyvBUn
— PSA Squash Tour (@PSASquashTour) October 23, 2026
Result: @SVOpenSquash 2026 Women's QF 🇮🇳 @Anahat_Singh13 beats [6] Salma Hany 🇪🇬 3-2: 4-11, 11-8, 4-11, 11-2, 11-5 (42m) 📝 Live updates 👉 https://t.co/ZfiBIEN7nb https://t.co/nYGIoRCC97
— PSA Squash Tour (@PSASquashTour) October 22, 2026
ఇదీ చదవండి:


