Photo Credit: Twitter
జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరుగుతున్న పారా ఆసియా గేమ్స్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. ఐదో రోజు భారత్ వంద పతకాల మార్క్‌ను దాటడం విశేషం. భారత అథ్లెట్ సందీప్ కుమార్ 400 మీటర్ల T44 ఈవెంట్‌లో 52.28 సెకన్ల మెరుపు వేగంతో స్ప్రింట్‌ను పూర్తి చేసి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడమే గాక, స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు.
ఇదే ఈవెంట్‌లో మరో భారత అథ్లెట్ అజయ్ కుమార్ 53.61 సెకన్ల సమయంలో గమ్యాన్ని చేరి కాంస్యంతో సందీప్‌తో పాటు పోడియంపై నిలిచాడు. పురుషుల సింగిల్స్ SL3 బ్యాడ్మింటన్ ఫైనల్‌లో నితేష్ కుమార్.. ప్రమోద్ భగత్‌ను ఓడించి స్వర్ణం కైవసం చేసుకున్నాడు.
పారా ఆర్చరీ పురుషుల రికర్వ్ టీమ్ ఈవెంట్‌లో హర్విందర్ సింగ్, విజయ్ సుండి 5-1 తేడాతో చైనాపై విజయం సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకొని స్వర్ణం చేజెక్కించుకున్నారు. ప్రమోద్ భగత్ రజతం గెలుచుకోగా, బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ SU5 ఫైనల్‌లో తులసిమతి మురుగేశన్ 18-21, 11-21 తేడాతో చైనాకు చెందిన యాంగ్ క్యూ జియాపై , రికర్వ్ మహిళల డబుల్స్‌లో పూజా జాత్యాన్- భావనా చౌదరి 0-6 తేడాతో వాంగ్ జుకియాన్-గావో జిహాన్‌పై గెలుపొందారు.
ఇక పురుషుల 1500మీ T46 ఫైనల్‌లో పర్మోద్ (4:09.65) రెండో స్థానంలో నిలవడం ద్వారా మరో మూడు రజత పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. ప్రస్తుతం భారత్ వంద పతకాల మార్క్‌ను అందుకోగా.. ఇందులో 25 స్వర్ణాలు, 32 రజతాలు, 43 కాంస్యాలున్నాయి. పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతుంది.
THIS IS HUGE RESULT, FOLKS! 🤩🥹 SANDEEP IS AN ASIAN PARA GAMES CHAMPION WITH A WORLD RECORD! 🤯🥇 AJAY KUMAR ALSO CLINCHES BRONZE WITH A NEW GAMES RECORD! 🥉 AND INDIA HAS OFFICIALLY REACHED THE 100-MEDAL MARK!!!! 💯 WHAT A DAY FOR INDIAN PARA-SPORTS! 🇮🇳 LET’S GOOOOO, INDIAAAAA! 🔥🔥🔥
— The Khel India (@TheKhelIndia) October 23, 2026
ఇదీ చదవండి: 60 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన ఆసీస్ బౌలర్


