Photo Credit: Twitter
క్రైస్ట్‌చర్చి వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో విజయం ద్వారా శుభారంభం చేసిన టీమిండియాకు భారీ షాక్ తగిలింది. భారత స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ గాయంతో రెండో టీ20కి దూరమైనట్లు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ ప్రకటించాడు. గురువారం జరిగిన తొలి టీ20లో ఇషాన్ కిషన్ గజ్జల్లో గాయంతో ఇబ్బంది పడ్డాడు.
దీంతో బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొందిన తిలక్ వర్మ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రాగా.. అతడి స్థానంలో ఇషాన్ బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే క్రీజులోకి వచ్చినప్పటి నుంచి ఇబ్బందిగా కనిపించిన ఇషాన్ మూడు బంతులాడి ఒక్క పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. అయితే పెవిలియన్ వెళ్లిన తర్వాత ఇషాన్ గాయం పెద్దది కానప్పటికీ, రెండో టీ20కి అతడికి విశ్రాంతినిచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఇదే విషయంపై బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ మాట్లాడుతూ.. ‘ఇషాన్ కిషన్ గజ్జల్లో నొప్పితో బాధపడుతున్నాడు. గాయం తీవ్రత అంతగా లేనప్పటికీ, రెండో టీ20లో అతడు ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఒకవేళ రెండో టీ20లో ఇషాన్ ఆడకపోతే, వైభవ్ సూర్యవంశీ ఆడే చాన్స్ ఉంది. ఇక తొలి టీ20లో ఇషాన్ కిషన్ గాయంతో ఇబ్బంది పడడంతోనే బ్యాటింగ్‌లో తిలక్ వర్మకు ప్రమోషన్ లభించింది. రెండో టీ20లో తిలక్ తన స్థానంలోనే బ్యాటింగ్‌కు వస్తాడు’ అని చెప్పుకొచ్చాడు.
రీఎంట్రీ తర్వాత ఇషాన్ కిషన్ సూపర్ ఫామ్ కనబరుస్తున్నాడు. ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వస్తున్న ఇషాన్ భారీ ఇన్నింగ్స్‌లతో అలరిస్తున్నాడు. రీఎంట్రీ తర్వాత ఒక క్యాలెండర్ ఇయర్‌లో వెయ్యి పరుగుల మార్క్‌ను పూర్తి చేసుకున్న ఇషాన్ కిషన్ ఓవరాల్‌గా 67 టీ20ల్లో 1,955 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 13 అర్థసెంచరీలున్నాయి. ప్రస్తుతం ఇషాన్ కిషన్ ఐసీసీ పురుషుల టీ20 ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్ విభాగంలో నంబర్‌వన్ ర్యాంకులో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
INDIAN BATTING COACH ON REVSPORTZ: "Ishan Kishan has a groin niggle, that's why Tilak Varma was promoted. Ishan is also unlikely to play in the 2nd T20I. If Ishan doesn't play, Vaibhav Sooryavanshi has a strong chance to play". https://t.co/mJy10VEW4A
— Johns. (@CricCrazyJohns) October 23, 2026
ఇదీ చదవండి:


