breaking news
groin linear
-
రెండో టీ20కి ఇషాన్ కిషన్ దూరం.. వైభవ్‌కు చాన్స్!
క్రైస్ట్‌చర్చి వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో విజయం ద్వారా శుభారంభం చేసిన టీమిండియాకు భారీ షాక్ తగిలింది. భారత స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ గాయంతో రెండో టీ20కి దూరమైనట్లు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ ప్రకటించాడు. గురువారం జరిగిన తొలి టీ20లో ఇషాన్ కిషన్ గజ్జల్లో గాయంతో ఇబ్బంది పడ్డాడు. దీంతో బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ పొందిన తిలక్ వర్మ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రాగా.. అతడి స్థానంలో ఇషాన్ బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే క్రీజులోకి వచ్చినప్పటి నుంచి ఇబ్బందిగా కనిపించిన ఇషాన్ మూడు బంతులాడి ఒక్క పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. అయితే పెవిలియన్ వెళ్లిన తర్వాత ఇషాన్ గాయం పెద్దది కానప్పటికీ, రెండో టీ20కి అతడికి విశ్రాంతినిచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ మాట్లాడుతూ.. ‘ఇషాన్ కిషన్ గజ్జల్లో నొప్పితో బాధపడుతున్నాడు. గాయం తీవ్రత అంతగా లేనప్పటికీ, రెండో టీ20లో అతడు ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఒకవేళ రెండో టీ20లో ఇషాన్ ఆడకపోతే, వైభవ్ సూర్యవంశీ ఆడే చాన్స్ ఉంది. ఇక తొలి టీ20లో ఇషాన్ కిషన్ గాయంతో ఇబ్బంది పడడంతోనే బ్యాటింగ్‌లో తిలక్ వర్మకు ప్రమోషన్ లభించింది. రెండో టీ20లో తిలక్ తన స్థానంలోనే బ్యాటింగ్‌కు వస్తాడు’ అని చెప్పుకొచ్చాడు.రీఎంట్రీ తర్వాత ఇషాన్ కిషన్ సూపర్ ఫామ్ కనబరుస్తున్నాడు. ముఖ్యంగా టీ20 క్రికెట్లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వస్తున్న ఇషాన్ భారీ ఇన్నింగ్స్‌లతో అలరిస్తున్నాడు. రీఎంట్రీ తర్వాత ఒక క్యాలెండర్ ఇయర్లో వెయ్యి పరుగుల మార్క్‌ను పూర్తి చేసుకున్న ఇషాన్ కిషన్ ఓవరాల్‌గా 67 టీ20ల్లో 1,955 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 13 అర్థసెంచరీలున్నాయి. ప్రస్తుతం ఇషాన్ కిషన్ ఐసీసీ పురుషుల టీ20 ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్ విభాగంలో నంబర్‌వన్ ర్యాంకులో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.INDIAN BATTING COACH ON REVSPORTZ: "Ishan Kishan has a groin niggle, that's why Tilak Varma was promoted. Ishan is also unlikely to play in the 2nd T20I. If Ishan doesn't play, Vaibhav Sooryavanshi has a strong chance to play". https://t.co/mJy10VEW4A— Johns. (@CricCrazyJohns) October 23, 2026ఇదీ చదవండి: ‘ప్లాన్ లేదు.. ఏమీ లేదు; ఆడుకుంటూ పోయామంతే’అదరగొడుతున్న పారా అథ్లెట్లు.. పతకాల సెంచరీ కొట్టిన భారత్ -
హాస్టల్ గదిలో ఉరేసుకొని యువతి మృతి
నల్లకుంట, న్యూస్‌లైన్: పేదరికం...ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం రాలేదని బెంగ... అనారోగ్య సమస్య. ఈ కారణాల నేపథ్యంలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. నల్లకుంట ఇన్స్పెక్టర్ వి.జయపాల్‌రెడ్డి కథనం ప్రకారం... కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉంటున్న చెందిన గజ్జల వీరబ్రహ్మచారికి ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె గజ్జల సరళ (29) హైదరాబాద్‌లో పీజీ, బీఎడ్ పూర్తి చేసింది. ఉద్యోగ అన్వేషణ కోసం గత ఫిబ్రవరి 13న స్వగ్రామం నుంచి నగరానికి తిరిగి వచ్చి.. న్యూనల్లకుంట బాయమ్మవీధిలోని జననీ ఉమెన్స్ ప్రైవేట్ హాస్టల్లో ఉంటోంది. హెడ్ నర్స్‌గా పనిచేస్తున్న ప్రణయసుధ, ఎంబీఏ విద్యార్థినులు రీణ, పద్మలు సరళతో పాటు హాస్టల్ గదిలో ఉంటున్నారు. గురువారం గదిలో ఒంటరిగా ఉన్న సరళ ఉదయం 9 గంటలకు హాస్టల్లోని కిచెన్ వద్దకు వెళ్లి వంట మనిషిని టీ కావాలని అడిగింది. తిరిగి గదికి వెళ్లి తలుపులు బిగించుకొని ఫ్యాన్ హుక్కు నైలాన్ తాడుతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నైట్ డ్యూటీ ముగించుకొని ఉదయం 10 గంటలకు ఇంటికి వచ్చిన ప్రణయసుధ గది తలుపు తెరిచి చూడగా సరళ ఉరేసుకొని కనిపించింది. హాస్టల్ నిర్వాహకుడి సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించగా... సరళ రాసిన సూసైడ్‌నోట్ దొరికింది. ‘నిస్సాహాయతతోనే ఆత్మహత్య చేసుకుంటున్నా.. నా మృతదేహాన్ని, లగేజీని మా ఉరికి చేర్చండి.. రవాణా ఖర్చుల కోసం బెడ్ కింద రూ.600 పెడుతున్నా’ అని రాసి ఉంది. టీచర్ ఉద్యోం చేస్తానని వచ్చింది: వీరబ్రహ్మచారి మృతురాలి తండ్రి ఏదైన ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తానని చెప్పి హైదరాబాద్‌కు వచ్చింది. వెళ్లొద్దని వారించినా.. గ్యాస్ వెల్డింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న నీకు ఆసరాగా ఉంటానని చెప్పింది. రెండు రోజుల క్రితం ఫోన్లో మాట్లాడింది. 28న ఇంటి వస్తానని చెప్పింది. పెళ్లి సంబంధాలు చూస్తున్నా. అంతలోనే నా బిడ్డ ఎందుకిలా చేసిందో అర్థం కావడంలేదని సరళ తండ్రి వీరబ్రహ్మచారి రోదించారు.


