కాలిఫోర్నియా: సిలికాన్ వ్యాలీ ఓపెన్ అంతర్జాతీయ స్క్వాష్ టోర్నీలో భారత రైజింగ్ స్టార్ అనాహత్ సింగ్ పరాజయం పాలైంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 15వ ర్యాంకర్ అనాహత్ 11–5, 6–11, 4–11, 7–11తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ శివసంగరి సుబ్రమణియమ్ (మలేసియా) చేతిలో ఓడింది. ‘గోల్డ్ లెవెల్’ టోర్నీలో తొలి సారి సెమీఫైనల్ దశకు చేరుకున్న 18 ఏళ్ల అనాహత్... తుది పోరుకు చేరకుండానే నిష్క్రమించింది. శివసంగరి చేతిలో అనాహత్‌కు ఇది నాలుగో ఓటమి.


