ఎనిమిదిసార్లు ప్రపంచ చాంపియన్
నూర్ షెర్బినిపై భారత స్క్వాష్ స్టార్ విజయం
న్యూఢిల్లీ: భారత స్క్వాష్ రైజింగ్ స్టార్ అనాహత్ సింగ్ తన కెరీర్‌లోనే అతిపెద్ద, అతిగొప్ప విజయాన్ని నమోదు చేసుకుంది. ఈజిప్ట్ దిగ్గజం, వరుసగా 8 సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన నూర్ ఎల్ షెర్బినిపై అనాహత్ వరుస గేముల్లో గెలిచి పెను సంచలనం సృష్టించింది. అమెరికాలోని రెడ్‌వుడ్ సిటీలో జరుగుతున్న సిలీకాన్ వ్యాలీ ఓపెన్ గోల్డ్ లెవెల్ అంతర్జాతీయ టోర్నీ రెండో రౌండ్‌లో అనాహత్ ఈ అద్భుతం చేసింది.
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 15వ స్థానంలో ఉన్న 18 ఏళ్ల అనాహత్ 30 నిమిషాల్లో 11–8, 11–8, 11–7తో టాప్ సీడ్, ప్రపంచ 3వ ర్యాంకర్ నూర్ షెర్బినిని బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 14వ ర్యాంకర్ సల్మా హనీ (ఈజిప్ట్)తో అనాహత్ తలపడుతుది.


