All Eng Open: సంచలనాలకు సెమీస్‌లో ముగింపు.. గాయత్రి, ట్రెసా జోడి ఓటమి

All ENG Open: Treesa Jolly-Gayatri Gopichand Sign Off-Semi-final Stage - Sakshi

బర్మింగ్‌హమ్‌: ప్రతిష్టాతక్మ ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన యువ జంట గాయత్రి పుల్లెల, ట్రెసా జోలీల సంచలన ప్రదర్శన సెమీస్‌లో ముగిసింది. బర్మింగ్‌హమ్‌లో శనివారం జరిగిన సెమీస్‌ మ్యాచ్‌లో కొరియాకు చెందిన బేక్ నా హా, లీ సో హీ జంట చేతిలో 10-21, 10-21తో ఓటమి పాలయ్యారు.

46 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో గాయత్రి, ట్రెసాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. తొలి గేమ్‌లో 0-4తో వెనుకబడిన గాయత్రి జోడి ఆ తర్వాత కాస్త ప్రతిఘటించడంతో 9-13కు తగ్గింది. ఆ తర్వాత అదే టెంపోను కొనసాగించడంలో విఫలమైన ఈ జోడి చివరకు రెండు వరుస గేముల్లో ఓడి సెమీస్‌లోనే తమ పోరాటాన్ని ముగించారు. ఒకవేళ​ ఫైనల్‌ చేరి ఉంటే మాత్రం ఈ ఇ‍ద్దరు చరిత్ర సృష్టించేవారు. కానీ ఏం చేస్తాం మంచి చాన్స్‌ మిస్‌ అయింది. 

చదవండి: స్టన్నింగ్‌ క్యాచ్‌.. హర్మన్‌ కూడా ఊహించి ఉండదు

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top