ప్రిక్వార్టర్స్‌లో గాయత్రి–ట్రెసా జోడీ | Gayatri Tresa Jodi in Prequarters | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో గాయత్రి–ట్రెసా జోడీ

Jun 5 2024 3:25 AM | Updated on Jun 5 2024 3:25 AM

Gayatri Tresa Jodi in Prequarters

తొలి రౌండ్‌లోనే ఓడిపోయిన ప్రణయ్, కిరణ్‌ జార్జి

జకార్తా: ఇండోనేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల డబుల్స్‌ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్‌) జోడీ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 21–15, 21–11తో యు పె చెంగ్‌–యు సింగ్‌ సన్‌ (చైనీస్‌ తైపీ) జంటను ఓడించి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 

పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్, ప్రియాన్షు రజావత్‌ ముందంజ వేయగా... భారత నంబర్‌వన్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్, కిరణ్‌ జార్జి తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. లక్ష్య సేన్‌ 21–12, 21–17తో కెంటా సునెయామ (జపాన్‌)పై గెలుపొందగా... ప్రియాన్షు 21–17, 21–12తో ప్రణయ్‌ను బోల్తా కొట్టించాడు. 

కిరణ్‌ జార్జి 21–11, 10–21, 20–22తో హాంగ్‌ యాంగ్‌ వెంగ్‌ (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో సుమీత్‌ రెడ్డి–సిక్కి రెడ్డి (భారత్‌) ద్వయం 18–21, 21–16, 21–17తో విన్సన్‌ చియు–జెనీ గాయ్‌ (అమెరికా) జోడీని ఓడించి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది.   
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement