టీ20 ప్రపంచకప్-2026లో తుది పోరుకు తేర లేచింది. అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్-భారత్ తలపడతున్నాయి. ఈ బ్లాక్ బ్లాస్టర్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ తొలుత టీమిండియాను బ్యాటింగ్‌కు అహ్హనించాడు. న్యూజిలాండ్ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగింది.
మెక్‌కాంచీ స్ధానంలో పేసర్ జాకబ్ డఫీ తుది జట్టులోకి వచ్చాడు. టీమిండియా మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. సెమీస్‌లో ఆడిన టీమ్‌నే కొనసాగించింది. ఇక టాస్ సందర్భంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
"ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. గత కొన్ని మ్యాచ్‌లుగా మేము మొదట బ్యాటింగ్ చేస్తూ అద్భుతంగా రాణిస్తున్నాము. సెమీస్ లేదా ఫైనల్ వంటి మెగా మ్యాచ్‌లలో తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోరును ప్రత్యర్ధి ముందు ఉంచిగల్గితే ఉత్తమంగా ఉంటుంది.
2023 వరల్డ్‌కప్ ఓటమి గురుంచి మేము ఆలోచించడం లేదు. అది గతం మాత్రమే. ఇది డిఫెరెంట్ ఫార్మాట్. మా కుర్రాళ్లు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నారు. 1,20,000 మంది ప్రేక్షకుల ముందు ఇటువంటి మ్యాచ్ ఆడడం నిజంగా చాలా స్పెషల్. టాస్ వేసే సమయానికే స్టేడియం నిండిపోయింది. మా ఆట తీరుతో వారిని అలరిస్తామని" సూర్య పేర్కొన్నాడు.
తుదిజట్లు
భారత్
అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చకరవర్తి, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా
న్యూజిలాండ్
టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), ఫిన్ అల్లెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీ


