పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. సెలక్టర్ పదవికి అలీం దర్ రాజీనామా చేయగా.. అతడి స్థానంలో ఇద్దరిని సెలక్షన్ కమిటీలో చేర్చింది. కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో పాకిస్తాన్ జట్టు విఫలమైన విషయం తెలిసిందే.
సెమీ ఫైనల్ చేరకుండానే
గ్రూప్ దశలో ఫర్వాలేదనిపించిన సల్మాన్ ఆఘా బృందం.. సూపర్-8లో మాత్రం చేతులెత్తేసింది. ఫలితంగా సెమీ ఫైనల్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో పాక్ జట్టుపై.. ముఖ్యంగా సీనియర్లు బాబర్ ఆజం (Babar Azam), షాబాద్ ఖాన్, షాహిన్ ఆఫ్రిదిలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.
అలీం దర్ రాజీనామా
ఈ క్రమంలో సెలక్టర్, మాజీ అంపైర్ అలీం దర్ రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. శ్రీలంకలో తమ మ్యాచ్‌ల దృష్ట్యా హెడ్‌కోచ్ మైక్ హసన్ (Mike Hesson), మరో సెలక్టర్ ఆకిబ్ జావేద్ బాబర్, షాదాబ్‌లను ఆడించాలని పట్టుపట్టగా.. అలీం మాత్రం వ్యతిరేకించినట్లు సమాచారం.
అంతేకాదు వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌ను ఎంపిక చేయాలని అలీం వాదించగా.. మిగతా వారు అందుకు ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఈ పరిణామాలతో నొచ్చుకున్న అలీం దర్ తన పదవికి రాజీనామా చేశాడు.
సెలక్టర్లు మాజీ కెప్టెన్లు
ఈ నేపథ్యంలో పీసీబీ ఇద్దరిని జాతీయ సెలక్షన్ కమిటీలో చేర్చింది. మాజీ కెప్టెన్లు మిస్బా ఉల్ హక్, సర్ఫరాజ్ అహ్మద్‌లకు మెన్స్ సెలక్షన్ కమిటీలో చోటు ఇచ్చింది. కాగా ఆకిబ్ జావేద్, అసద్ షఫీక్‌లతో కలిసి వీరిద్దరు సెలక్టర్లుగా పనిచేయనున్నారు.
కాగా అలీం దర్ గతేడాది అక్టోబరులో పాక్ పురుషుల జట్టు కెప్టెన్‌గా వచ్చాడు. అయితే, హెడ్‌కోచ్ మైక్ హసన్ అతి జోక్యం, ఆకిబ్ జావేద్ అతడికే వంతపాడిన నేపథ్యంలో విసుగు చెంది రాజీనామా చేసినట్లు స్థానిక మీడియా జియో సూపర్ వెల్లడించింది.
గతంలో ఇలా..
ఇదిలా ఉంటే.. సర్ఫరాజ్ అహ్మద్ గతంలో పాకిస్తాన్ అండర్-19 జట్టు పాక్ షాహీన్స్‌కు మెంటార్‌గా వ్యవహరించాడు. మరోవైపు.. మిస్బా ఉల్ హక్ గతంలో పాక్ జట్టు హెడ్‌కోచ్‌గా, చీఫ్ సెలక్టర్‌గా బాధ్యతలే నిర్వర్తించాడు.
అంతేకాదు.. పీసీబీ క్రికెట్ టెక్నికల్ కమిటీలో సభ్యుడిగానూ సేవలు అందించాడు. ఇప్పుడు మరోసారి సెలక్టర్‌గా తిరిగి వచ్చాడు. ఇక బాబర్, షాదాబ్ విఫలమైన సంగతి తెలిసిందే.
చదవండి: T20 WC 2026: రషీద్ ఖాన్‌పై వేటు.. అఫ్గనిస్తాన్‌కు కొత్త కెప్టెన్


