● నాయకులు, కార్యకర్తలు జాగ్రత్త వహించండి
● ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి
ఆత్మకూరు: ‘గ్రామాలకు చెందిన ఓటర్లు ఉద్యోగ, వ్యాపార పనుల రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉంటే ఆ ఓట్లను తొలగించే ప్రమాదం ఉంది. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు జాగ్రత్త వహించాలి’ అని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి సూచించారు. పట్టణంలోని తన కార్యాలయంలో బుధవారం పార్టీ కార్యకర్తలు, నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇన్‌టెన్సివ్ రివిజన్)లో ఓటర్ల జాబితాను సరిచూసే కార్యక్రమం ఆత్మకూరు నియోజకవర్గంలో పదిరోజుల అనంతరం ప్రారంభం కానుందన్నారు. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో లక్షలాది ఓట్లను తొలగించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ వారి ఓటును తొలగింపబడకుండా చూసుకోవాలన్నారు. అనంతరం పార్టీ కమిటీల జాబితాను వెంటనే అందజేయాలని ఆయన నాయకులను కోరారు. కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు సుధాకర్‌రెడ్డి, నాయకులు బొమ్మిరెడ్డి రవికుమార్‌రెడ్డి, సీహెచ్ కామాక్షయ్య నాయుడు, ఎన్‌ఆర్‌ఐ మీరామొహిద్దీన్, కె.కిశోర్, టి.అశోక్, అండ్రా సుబ్బారెడ్డి, రావూరు శ్రీనివాసులురెడ్డి, బొలిగర్ల వెంకటేశ్వర్లు, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


