సంగం: కంకర లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి చెరువులో బోల్తాపడి డ్రైవర్ మృతిచెందిన ఘటన శుక్రవారం మండలంలోని వంగల్లు గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తిరువీధిపాడు గ్రామం నుంచి సంగం వైపు కంకర లోడుతో ట్రాక్టర్ వెళ్తోంది. ఈ క్రమంలో అదుపుతప్పి చెరువులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కాశీపాళేనికి చెందిన షేక్ సుభాని (48) మృతిచెందాడు. సమాచారం అందుకున్న సంగం ఎస్సై రాజేష్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. కేసు నమోదు చేశారు.


