అప్సడా చట్టం ప్రకారం ప్రభుత్వ అనుమతులు లేకుండా ఫీడ్ కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచడం అన్యాయం. కంపెనీలన్నీ సిండికేట్లుగా మారి ధరలు పెంచి రైతులను దోచుకుంటున్నారు. ఫీడ్ ధరలు తగ్గించకపోతే క్రాప్ హాలిడే ప్రకటించాల్సి ఉంటుంది.
– పి చెంగయ్య ఆక్వా రైతు,
కల్లూరుపల్లిపాళెం
●
ఇలా అయితే సాగు చేయలేం
ఇప్పటికే రొయ్యలకు సరైన ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నాం. ఈ పరిస్థితుల్లో మేత ధరలు పెంచడం మరో భారంగా మారుతోంది. వ్యాపారులు సిండికేట్లుగా ఏర్పడి రొయ్యల ధరలు అమాంతంగా తగ్గించేశారు. ఈ పరిస్థితుల్లో ఆక్వా సాగు కష్టతరంగా మారుతోంది.
– వి వెంకటరమణయ్య
ఆక్వా రైతు, తూపిలిపాళెం


