సంగం: మండలంలోని దువ్వూరులో ఈ నెల 7 నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీలను నిర్వహించనున్నట్లుగా జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ సతీష్ తెలిపారు. రాష్ట్రస్థాయి బీచ్ కబడ్జీ పోటీలకు ఎంపికై న జిల్లా పురుష, మహిళల జట్లకు టీషర్టులను మంగళవారం అందజే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో తొలిసారిగా 26 జిల్లాల నుంచి మహిళలు, పురుషుల జట్లు పాల్గొంటున్నాయని తెలిపారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భోజనం, వసతి సౌకర్యాలను కల్పిస్తున్నామని చెప్పారు. జిల్లా పురుషుల జట్టుకు 16 మంది, మహిళల జట్టకు 10 మంది క్రీడాకారులను ఎంపిక చేశామని తెలిపా రు. వారిలో ప్రతిభ కనబరిచిన 6 మంది పురుషులు, 6 మంది మహిళలను తుది జట్లలోకి తీసుకుంటా మని చెప్పారు. జిల్లా జట్టులో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సునీల్, నవీన్ వంటి ప్రముఖ క్రీడాకారులు ఉండడం గర్వకారణమన్నారు. ఈ పోటీల్లో నెల్లూరు జట్టు ఫైనల్స్‌కు చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


