ముత్తుకూరు (పొదలకూరు) : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుణ్యానే పేదలు పక్కా ఇళ్లు నిర్మించుకోగలిగారని, ప్రభుత్వ లేఅవుట్లు ఏర్పాటు చేసి ఊర్లే నిర్మించిందని మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని బ్రహ్మదేవంలో జగనన్న కాలనీని ఆదివారం కాకాణి సందర్శించారు. ఆయన కాలనీలో లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందని లబ్ధిదారులు తెలిపారు. మళ్లీ తమ ప్రభుత్వం వచ్చి ఉంటే అన్ని సదుపాయలను కల్పించే వారమని కాకాణి వెల్లడించారు. మహిళలు తమకు రూ.లక్షలు విలువ చేసే ప్లాట్లు ఇచ్చి ఇళ్లను నిర్మించి అందజేసిన జగన్‌మోహన్‌రెడ్డిపై కృతజ్ఞతాభావంతో ఆయన చిత్రపటానికి పాలాభిషే కం చేసి అభిమానం చాటుకున్నారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ బ్రహ్మదేవం సచివాలయం వద్ద గిరిజనులకు లేఅవుట్ వేసి ప్లాట్లు పంపిణీ చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే లాగేసుకుని వ్యవసాయం చేసుకుంటున్నట్టు తెలిపారు. గిరిజనుల ఇళ్లు అర్ధాంతరంగా నిలిపివేశారని గ్రామ నాయకుడు మస్తాన్ ఇల్లు నిర్మించేందుకు వీల్లేదని టీడీపీ నాయకులు హుకుం జారీ చేశారన్నారు. పేదవాడి సొంతింటి కలను జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చితే.. సోమిరెడ్డి ఆదేశాలతో సర్వేపల్లి నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణాలను ఆపేశారని ఆరోపించారు. బ్రహ్మదేవంలో ఇళ్ల పట్టాల సమస్య 24 ఏళ్లుగా నోచుకోలేదని 2002లో అప్పటి ఎంపీపీ మెట్టా చంద్రశేఖర్‌రెడ్డి ఇళ్ల పట్టాలు అందజేయాలని ప్రయత్నిస్తే సోమిరెడ్డి అడ్డుకున్నాడన్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినా సోమిరెడ్డి మంత్రిగా ఉన్నప్పటికీ ఈ గ్రామంలో పేదల పట్టాలపై శ్రద్ధ చూపలేదన్నారు. 4.57 ఎకరాల్లో నుడా తరహాలో అధునాతనంగా 137 ప్లాట్లతో లేఅవుట్ వేసి పేదలకు పట్టాలను పంపిణీ చేశామన్నారు. లేఅవుట్లో ఎస్టీలకు ప్లాట్లు కేటాయించి సీఎస్‌ఆర్ నిధులు రూ.15 వేలు అదనంగా వారికి అందజేశామన్నారు. లేఅవుట్లో 74 ఇళ్ల నిర్మాణం ప్రారంభించగా 54 ఇళ్లలో పేదలు నిర్మాణాలను పూర్తి చేసుకుని నివసిస్తున్నారని 20 ఇళ్లు పూర్తి కావాల్సి ఉందన్నారు. రూ.13 లక్షల నుంచి రూ.15 లక్షల విలువైన ఆస్తిని పేదలకు పట్టాల రూపంలో అందజేసిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. టెన్త్ ఫలితాల్లో 587 మార్కులు సాధించిన గ్రామానికి చెందిన కాళంగి లక్ష్మీశ్రావ్యను కాకాణి అభినందించి మెమోంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీపీ సుగుణమ్మ, అన్నాబత్తిన కృష్ణవేణి, జెడ్పీటీసీ వెంకటసుబ్బయ్య, నాయకులు రామ్మోహన్‌రెడ్డి, జమీల్, బషీర్, అగ్ని మస్తాన్, సుబ్రహ్మణ్యం, జనార్దన్‌రెడ్డి, చెంగారెడ్డి, కోదండరామిరెడ్డి పాల్గొన్నారు.
మళ్లీ ప్రభుత్వం వచ్చి ఉంటే మౌలిక సదుపాయాలు జరిగేవి
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
వైఎస్ జగన్ చిత్రపటానికి
మహిళల పాలాభిషేకం


