కొడుకు ఆచూకీ చెప్పాలని.. తండ్రిపై లాఠీల విన్యాసం | - | Sakshi
Sakshi News home page

కొడుకు ఆచూకీ చెప్పాలని.. తండ్రిపై లాఠీల విన్యాసం

May 13 2026 12:20 AM | Updated on May 13 2026 12:20 AM

అయితే రవీంద్రను అరెస్ట్‌ చేసేందుకు వచ్చిన పోలీసులు అతను లేకపోవడంతో తండ్రి గడుకోటి పోలయ్య ఎక్కడ అని కుటుంబ సభ్యులను అడిగారు. గొర్రెలు మేపుకునేందుకు మనుబోలు మండలం బద్దెవోలు గ్రామానికి వెళ్లాడని కుటుంబ సభ్యులు చెప్పడంతో పోలీసులు నేరుగా బద్దెవోలు గ్రామానికి వెళ్లి పోలయ్యపై విచక్షణా రహితంగా లాఠీతో చితకబాదారు. అతన్ని ఆటోలో ఎక్కించుకుని గూడూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకు వచ్చి అక్కడ కూడా కొడుకు ఆచూకీ చెప్పాలంటూ సీఐ, ఎస్సైలు, కానిస్టేబుళ్లు వరుస పెట్టి మరోసారి లాఠీలతో తీవ్రంగా కొట్టడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో ఆ రాత్రికి వదిలేశారు. స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు ఈ విషయం తెలుసుకుని ఆతన్ని గూడూరు ఏరియా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరుకు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement