బంగారం, నగదు చోరీ | - | Sakshi
Sakshi News home page

బంగారం, నగదు చోరీ

May 15 2026 12:07 PM | Updated on May 15 2026 12:07 PM

వెంకటాచలం: తాళం వేసిన ఇంటి తలుపులను గుర్తుతెలియని వ్యక్తులు పగులగొట్టి చోరీకి పాల్పడిన ఘటన మండల కేంద్రమైన వెంకటాచలంలో గురువారం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. వెంకటాచలంలోని రైల్వేగేట్‌ సమీపంలో నివాసముంటున్న పద్మమ్మ మూడు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి తన కుమార్తె వద్దకు వెళ్లింది. గురువారం ఉదయం తిరిగి రాగా ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నివాసంలో రెండు బీరువాలు పగులగొట్టి అందులో ఉన్న రూ.50 వేల నగదు, రెండు సవర్ల బంగారు నగలు చోరీ చేశారని బాధితురాలు తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

రోడ్డు ప్రమాదంలో

యువకుడికి తీవ్రగాయాలు

రాపూరు: మండలంలోని గోనుపల్లి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. రాపూరు నుంచి పెంచలకోనకు ఆర్టీసీ బస్సు వెళ్తోంది. పెంచలకోన నుంచి రాపూరుకు మోటార్‌బైక్‌పై కలువాయి మండలం ఊయాలపల్లికి గ్రామానికి చెందిన సురేష్‌ వెళ్తున్నాడు. ఈ క్రమంలో గోనుపల్లి మలుపు వద్ద బస్సు, బైక్‌ ఢీకొనడంతో సురేష్‌ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సురేష్‌ను రాపూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement