ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురై.. | - | Sakshi
Sakshi News home page

ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురై..

May 12 2026 12:08 AM | Updated on May 12 2026 12:08 AM

బాలుడికి తీవ్రగాయాలు

ఉదయగిరి: విద్యుదాఘాతానికి గురై ఓ బాలుడు తీవ్రంగా గాయపడిన ఘటన సోమవారం పట్టణంలోని ఇందిరానగర్‌ కాలనీ సమీపంలో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. కాలనీకి చెందిన వినీత్‌ పంచాయతీరాజ్‌ కార్యాలయ ఆవరణలో తోటి చిన్నారితో కలిసి ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌పై కోతి పిల్ల ఉండటంతో దానిని తరుముకుంటూ ప్రమాదవశాత్తు షాక్‌కు గురయ్యాడు. దీంతో అతని శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. తోటి పిల్లలు కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు వెంటనే చికిత్స నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం ఆత్మకూరుకు తీసుకెళ్లారు.

నిమ్మ ధరలు (కిలో)

పెద్దవి : రూ.120

సన్నవి : రూ.32

పండ్లు : రూ.20

Advertisement
 
Advertisement
Advertisement